Railway track: ఉత్తరాఖండ్‌లో రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్.. త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం
తాజాగా రైల్వే ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. తాజాగా ఉత్తరాఖండ్‌లో రూర్కీ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై కనిపించిన ఖాళీ ఎల్‌పీజీ సిలిండర్ గూడ్స్ రైలు పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఉత్తర రైల్వే సీపీఆర్‌వో అధికారుల ప్రకారం, ఈ ఘటన ఉదయం 6:35 గంటలకు లలాండౌర్- ధంధేరా స్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. గూడ్స్ రైలు ట్రాక్‌పై సిలిండర్ కనిపించగానే లోకో పైలట్ వెంటనే రైలును ఆపి అధికారులను అప్రమత్తం చేశారు. సిలిండర్‌ను పరిశీలించి, అది ఖాళీదని అధికారులు గుర్తించారు.
రైల్వే ట్రాకులపై నిఘా కట్టుదిట్టం
ఈ ఘటన స్థానిక పోలీసులను, జీఆర్పీ అధికారులను అలెర్ట్ చేసి కేసు నమోదు చేయడానికి దారితీసింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు, జీఆర్పీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇటీవల యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం గమనార్హం. రైలు పట్టాలపై ఇనుప రాడ్లు, సిలిండర్లు ఉంచడం వంటి చర్యలు తరచుగా జరుగుతున్నాయి. కాన్పూర్, లలిత్‌పూర్ వంటి ప్రాంతాల్లో పెద్ద ప్రమాదాలు నివారించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో లోకో పైలట్ల అప్రమత్తతే ప్రధానంగా అనేక ప్రమాదాలను నిరోధించగలిగింది. రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు రైల్వే ట్రాకులపై నిఘా కట్టుదిట్టం చేస్తున్నారు.