Uttarakhand tunnel: రెస్క్యూ ఆపరేషన్‌లో 'రాట్ హోల్' నిపుణులు.. 5మీటర్ల దూరంలో కార్మికులు
ఈ వార్తాకథనం ఏంటి
Uttarakhand tunnel: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ 17వ రోజుకు చేరుకుంది.
ఆగర్ మిషన్ ఇరిగిపోవడంతో.. రెస్క్యూ బృందం సోమవారం మాన్యువల్ డ్రిల్లింగ్ కార్యకలాపాలను ప్రారంభించింది.
ఈ క్రమంలో అనుభవజ్ఞులైన 24 మంది 'రాట్ హోల్ మైనింగ్(rat-hole mining)' నిపుణుల బృందాన్ని రంగంలోకి దింపింది.
'రాట్ హోల్' నిపుణులు విజయవంతంగా మాన్యువల్ డ్రిల్లింగ్‌ను చేపడుతున్నారు. కార్మికులు చిక్కుకున్న ప్రాంతం వైపు డ్రిల్లింగ్ చేస్తున్నారు.
దీంతో రెస్క్యూ టీం కార్మికులకు కేవలం 5 మీటర్ల దూరంలో ఉండటం గమనార్హం. దీంతో త్వరలోనే సొరంగంలో చిక్కుకున్న కార్మికులు బయటకు వచ్చే అవకాశం ఉంది.
రెస్క్యూ
సంఘటనా స్థలాన్ని సందర్శించిన ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ
సొరంగం సహాయ చర్యలను సమీక్షించేందుకు ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆయన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుఖ్‌బీర్ సింగ్ సంధూ ఉన్నారు.
రెస్క్యూ టీమ్‌లకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
సొరంగంలోదాదాపు 2 కి.మీ దూరంలో కార్మికులు చిక్కుకుపోయారు. కార్మికులతో మాట్లాడటానికి పైపు ద్వారా ల్యాండ్‌లైన్ కనెక్షన్ ఏర్పాటు చేసారు.
రోజుకు రెండుసార్లు, ఉదయం 9 నుంచి 11 గంటల వరకు.. సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు, సొరంగం ప్రదేశంలో ఉన్న వైద్యుల బృందం కార్మికులతో మాట్లాడుతుంది.