Page Loader
Ram Temple consecration: ఆలయ నిర్మాణం అసంపూర్తి: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి నలుగురు శంకరాచార్యులు దూరం

Ram Temple consecration: ఆలయ నిర్మాణం అసంపూర్తి: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి నలుగురు శంకరాచార్యులు దూరం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 11, 2024
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌లోని జ్యోతిష్‌పీఠ్ చెందిన 46వ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి అయోధ్యలో జనవరి 22న జరుగనున్న రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి నలుగురు శంకరాచార్యులు హాజరుకావడం లేదని తెలిపారు. ఆలయ నిర్మాణం అసంపూర్తిగా ఉందని, శాస్త్రాలకు వ్యతిరేకంగా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతోందని ఆరోపించారు. పూరీలోని గోవర్ధన పీఠానికి చెందిన శంకరాచార్య అయోధ్యలోని రామ మందిరం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు వెళ్లబోనని ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జనవరి 22న అయోధ్యలో రామ మందిరంలో పవిత్రోత్సవం నిర్వహించనున్నారు. భారతదేశం నలుమూలల నుండి వేలాది మంది వీక్షకులతో పాటు ఆహ్వానితులలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ,ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.

Details 

ప్రతిష్ఠాపన కార్యక్రమానికి దూరంగా కాంగ్రెస్,TMC

'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుకకు లక్ష మంది భక్తులను రావచ్చని అంచనా. బుధవారం,కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే,సోనియా గాంధీ,అధిర్ రంజన్ చౌదరి రామ మందిర ప్రతిష్టాపన ఆహ్వానాన్ని తిరస్కరించారు. రామాలయ ప్రారంభోత్సవం బీజేపీ, దాని సైద్ధాంతిక సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) రాజకీయ కార్యక్రమమని,అందుకే తాము హాజరుకావడం లేదని తెలిపారు. ఇదిలావుండగా, లోక్‌సభ ఎన్నికలకు ముందు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ద్వారా బీజేపీ జిమ్మిక్కులకు పాల్పడుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఆరోపించారు. ఇతర వర్గాలను మినహాయించే ఉత్సవాలకు తాను మద్దతివ్వబోనని TMC అధిష్టానం తేల్చి చెప్పింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాట్లాడుతున్న అవిముక్తేశ్వరానంద సరస్వతి