Fire in Army Camp Store: జోషిమఠ్‌లో ఆర్మీ క్యాంపులో భారీ అగ్ని ప్రమాదం
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం జరిగింది. ఔలి రోడ్డులోని ఆర్మీ క్యాంప్‌లోని స్టోర్‌లో మంటలు చెలరేగి, దట్టమైన పొగలు చుట్టుపక్కల వ్యాప్తి చెందాయి. వెంటనే అత్యవసర సేవా బృందాలు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు విస్తరించకుండా వెంటనే అదుపులోకి తెచ్చాయి. ప్రమాదానికి కారణం తెలియరాలేదు.
వివరాలు
గతంలోనూ..
గత ఏడాది మేలో, లెహ్‌లోని డిగ్రీ కాలేజీ సమీపంలోని ఆర్మీ క్యాంప్‌లో కూడా పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు సమీప భవంతుల వరకు చేరడంతో స్థానిక పోలీసులు, ఆర్మీ సిబ్బంది, అగ్నిమాపక బృందాలు కలసి మంటలను నియంత్రించగలిగారు. ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదు.అయితే ప్రమాదానికి కారణాలను మాత్రం అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. దీనికి మందు, జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌లోనూ ఆర్మీ క్యాంటిన్‌లోని బదామీ బాఘ్ కంటోన్మెంట్ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఘటనలో తీవ్రగాయాలతో ఒక పౌరుడు మృతి చెందాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జోషిమఠ్‌లో ఆర్మీ క్యాంపులో భారీ అగ్ని ప్రమాదం
#WATCH | A massive fire broke out in a store located inside an Army camp on the Auli Road in Joshimath, Chamoli district of Uttarakhand. pic.twitter.com/xr3K2EkikE
— ANI (@ANI) January 2, 2026