LOADING...
Avalanche: బద్రీనాథ్ సమీపంలో హిమపాతంలో చిక్కుకున్న 47 మంది కార్మికులు 
బద్రీనాథ్ సమీపంలో హిమపాతంలో చిక్కుకున్న 47 మంది కార్మికులు

Avalanche: బద్రీనాథ్ సమీపంలో హిమపాతంలో చిక్కుకున్న 47 మంది కార్మికులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 28, 2025
03:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గత కొన్ని రోజులుగా విస్తారంగా మంచు కురుస్తుండగా, శుక్రవారం ఉదయం అక్కడ మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయారు. బద్రీనాథ్‌ ధామ్‌కు సంబంధించిన జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు రహదారి నిర్మాణ పనుల్లో నిమగ్నంగా ఉన్నారని తెలుస్తోంది.

వివరాలు 

 అప్రమత్తంగా అంబులెన్స్‌లు

ఈ ఘటన బద్రీనాథ్‌కు సమీపంలోని మనా గ్రామంలో ఉన్న బీఆర్‌ఓ క్యాంప్‌ సమీపంలో జరిగింది. మొత్తం 57 మంది కార్మికులు మంచు చరియల కింద చిక్కుకుపోయినట్లు బీఆర్‌ఓ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సీఆర్‌ మీనా తెలిపారు. వీరిలో 10 మందిని రక్షించి క్యాంప్‌కు తరలించారు. మిగతా కార్మికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు అంబులెన్స్‌లను అప్రమత్తంగా ఉంచారు. అయితే, దట్టమైన మంచు కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని బీఆర్‌ఓ అధికారులు వెల్లడించారు.