Road Accident: బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 37 మంది దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
బొలీవియాలో శనివారం ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
క్షతగాత్రులను ఉయునిలోని నాలుగు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రాథమికంగా అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు.
శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఉయుని-కొల్చాని రహదారిపై రెండు బస్సులు ఢీకొన్నాయి.
Details
లోయలోకి దూసుకెళ్లిన బస్సు
ఈ ఘటనలో ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. రహదారి ప్రమాదకరంగా ఉండటం, వేగనియంత్రణ లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని అధికారులు తెలిపారు.
ఇదే విధంగా, గత జనవరిలో ఫొటోసీ-ఒరురో మధ్య జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో 800 మీటర్ల లోయలో బస్సు పడిపోవడంతో 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
ఈ తరహా ప్రమాదాలను తగ్గించేందుకు మెరుగైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు వెల్లడించారు.