Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్- ప్రయాగ్‌రాజ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
మహాకుంభమేళాలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులతో ప్రయాణిస్తున్న బస్సును కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో 10 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 19 మంది గాయపడ్డారు.
ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలోనుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగంలో స్నానం చేయడానికి భక్తులు వెళ్తుండగా, ప్రయాగ్‌రాజ్-మిర్జాపూర్ హైవేలోని మేజా ప్రాంతంలో బొలెరో కారు బస్సును ఢీకొట్టింది.
ఈ ఘటనలో 10 మంది మరణించగా, 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం స్వరూప్ రాణి మెడికల్ హాస్పిటల్‌కు తరలించారని డీసీపీ వివేక్ చంద్ర యాదవ్ వెల్లడించారు.
ప్రస్తుతం మరణించిన వారి వివరాలు, ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తూ తదుపరి చర్యలు చేపట్టారు.
వివరాలు
మృతుల కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ సానుభూతి
ఈ విషాదకర ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇటీవల జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.