తదుపరి వార్తా కథనం

3 Indian Women Killed In US: అమెరికాలో రోడ్డు ప్రమాదం...ముగ్గురు భారత మహిళలు మృతి
వ్రాసిన వారు
Stalin
Apr 27, 2024
04:21 pm
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా(America)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో(Car Accident)భారత్(India)కు చెందిన ముగ్గురు మహిళలు(Womens)దుర్మరణం పాలయ్యారు.
గుజరాత్(Gujarath)లోని ఆనంద్ జిల్లా నివాసితులైన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీషాబెన్ పటేల్ గా వీరిని పోలీసులు గుర్తించారు.
సౌత్ కరోలినాలోని గ్రీన్‌విల్లే కౌంటీలోని ఒక వంతెనపైనుంచి వారి ఎస్ యూవీ (Suv Car) కారు వేగంగా రోడ్డు (Road) పైకి దూసుకెళ్లి పక్కనే ఉన్న డివైడర్ తగిలి చెట్లను ఢీకొంది.
దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
వంతెనకు ఎదురుగా ఉన్న చెట్లను ఢీకొనే ముందు వీరి కారు 20 అడుగుల గాలిలోకి ఎగిరింది.
దీంతో కారు చెట్టుపై ఇరుక్కుపోయి నుజ్జు నుజ్జు అయిపోయిందని అని పోలీస్ అధికారి మిస్టర్ ఎల్లిస్ తెలిపారు.