Page Loader
Kerala Accident: కేరళలో బస్సును కారు ఢీకొని.. ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి 
కేరళలో బస్సును కారు ఢీకొని.. ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి

Kerala Accident: కేరళలో బస్సును కారు ఢీకొని.. ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 03, 2024
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.అలప్పుజా జిల్లా లో కారు,బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి చెందగా,మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం ప్రకారం,బస్సు అతివేగంగా రావడంతో కారు తో ఢీకొన్నట్లు తెలుస్తోంది. బాధితులుగా వందనం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ముహ్సిన్, మహమ్మద్,ఇబ్రహీం,దేవన్‌లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది.తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు విద్యార్థులను వందనం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం,మృతులెవరు కోజికోడ్,కన్నూర్,చేర్యాల,లక్షద్వీప్ ప్రాంతాలకు చెందినవారు. ఈ ప్రమాదంలో కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్(KSRTC)బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఈప్రమాదానికి సంబంధించిన వివిధ కోణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారీ వర్షం.. రాత్రి 10 గంటలకు ప్రమాదం