Road Accident: మధ్యప్రదేశ్‌లో బస్సు, ట్రక్కు ఢీ.. 9 మంది దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్‌లోని మైహార్ సమీపంలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ప్రయాగ్‌రాజ్ నుంచి నాగ్‌పూర్ వెళ్తున్న అభా ట్రావెల్స్‌కు చెందిన హైస్పీడ్ లగ్జరీ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది.
ఈ ఘోర ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోగా, ముగ్గురు సత్నా ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.
Details
డ్రైవర్ సహా కొందరి పరిస్థితి విషమం
ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమవ్వడంతో రెస్క్యూ టీమ్ గ్యాస్ కట్టర్ సాయంతో మృతదేహాలను బయటకు తీశారు.
45 మంది ప్రయాణికులతో నిండిన ఈ బస్సు, మైహార్ సమీపంలో నదన్ వద్ద ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
క్షతగాత్రులను మైహార్, సత్నా ఆస్పత్రులకు తరలించగా, డ్రైవర్ సహా కొందరి పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.