
Road Acident: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగిలి ఘాట్ వద్ద ఓ బస్సు రెండు లారీలను ఢీకొనడంతో 8 మంది మరణించినట్లు సమాచారం. 40 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది.
గాయపడిన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.
సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం వల్ల ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, కానీ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధం చేశారు.
వివరాలు
రెండు లారీలను ఢీకొట్టిన బస్సు
ఇక బస్సు పలమనేరు నుంచి చిత్తూరు వైపునకు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పడంతోనే ఇది జరిగిందని భావిస్తున్నారు.
అదుపు తప్పిన బస్సు పక్క రోడ్డులోకి దూసుకెళ్లి, రెండు లారీలను ఢీకొట్టింది.
పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని, బాధితులను అంబులెన్సుల ద్వారా సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది.