
Kerala: కేరళలో రోడ్డు ప్రమాదం.. నవదంపతులతో సహా నలుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని కలిగించింది. 15 రోజులు క్రితం పెళ్లి చేసుకున్న నవ దంపతులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
పెళ్లి తరువాత హనీమూన్‌కు మలేసియాకు వెళ్లిన ఈ జంట, తిరిగి కేరళకు వచ్చారు.
నిఖిల్ తండ్రి మథాయ్ ఈపన్, అను తండ్రి జార్జ్ బిజులు వారిని రిసీవ్ చేసుకోవడానికి తిరువనంతపురం వెళ్లారు.
ఆదివారం ఉదయం 4:05 గంటల ప్రాంతంలో, వారు ప్రయాణిస్తున్న కారు పనలూరు-మువట్టుపుజ రహదారిపై ఒక బస్సును ఢీకొట్టింది. ఈ బస్సు తెలంగాణకు చెందిన అయ్యప్ప భక్తులగా గుర్తించారు.
Details
కారు డ్రైవర్ నిద్రమత్తే కారణం
ఈ ప్రమాదంలో నిఖిల్, జార్జ్ బిజు, ఈపన్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అను కూడా మృతి చెందింది.
ప్రమాదం జరిగిన తర్వాత బస్సు డ్రైవర్ సహా కొంతమంది భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను హైడ్రాలిక్ సాయంతో బయటకు తీశారు.
కారులోని డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.