SA: యుద్ధ క్షేత్రం నుంచి వెనుదిరిగిన అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన విమాన వాహక నౌక 'జెరాల్డ్ ఆర్ ఫోర్డ్' యుద్ధ ప్రాంతం నుంచి వైదొలిగి మరమ్మతుల కోసం గ్రీస్‌లోని నాటో స్థావరం క్రెటెకు బయల్దేరింది. ఈ నౌకలో గత వారం లాండ్రీ విభాగంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మార్చి 12న మంటలు చెలరేగగా ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు సైలర్లకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఈ నౌక ఎర్ర సముద్రం మీదుగా క్రెటెలోని సౌదా బేకు ప్రయాణిస్తోంది. అక్కడ కొంతకాలం నిలిచి తక్షణ మరమ్మతులు పూర్తి చేసుకునే అవకాశముంది. అయితే క్యారియర్ స్ట్రైక్ గ్రూపులోని మిగిలిన నౌకలు మాత్రం యుద్ధ ప్రాంతంలోనే కొనసాగుతున్నాయి.
Details
స్పందించని పెంటగాన్
అవి జెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌తో కలిసి ప్రయాణించడం లేదు. ఈ నౌక మరమ్మతులకు వెళుతోందన్న సమాచారంపై యూఎస్‌ఎన్‌ఐ న్యూస్ నివేదిక వచ్చినప్పటికీ, పెంటగాన్ వెంటనే స్పందించలేదు. ఇదిలాఉండగా.. ఈ అగ్నిప్రమాద తీవ్రతను పెంటగాన్ తగ్గించి చూపిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈ ప్రమాదంలో సుమారు 600 మంది సిబ్బందికి సంబంధించిన బెడ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే మంటలు దాదాపు 30 గంటల పాటు అదుపులోకి రాకుండా కొనసాగినట్లు వెల్లడించింది.