తదుపరి వార్తా కథనం
Mexico: మెక్సికోలో బస్సును ఢీకొన్న ట్రక్కు.. 40 మంది సజీవ దహనం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 09, 2025
09:49 am
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
48 మంది ప్రయాణిస్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున జరిగింది.
బస్సులో మంటలు విస్తరించడంతో 38 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ కూడా మృతి చెందారు.
స్థానిక అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం, ఘటనాస్థలంలో ఇప్పటివరకు 18 మంది ప్రయాణికుల అవశేషాలను గుర్తించారు.
సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిపారు.