USA: అమెరికాలో ఘోరరోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు ప్రాణాలు కోల్పోయారు.
భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారు తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, కొందుర్గ్ మండలానికి చెందిన టేకులపల్లి గ్రామస్తులు.
మృతులుగా ప్రణీత రెడ్డి (35), ఆమె కుమారుడు హర్వీన్ (6), మరియు అత్త సునీత (56) గుర్తించబడ్డారు.
వివరాలు
స్పాట్ లో హర్వీన్, సునీత మృతి
సిద్దిపేటకు చెందిన రోహిత్ రెడ్డితో ప్రణీత రెడ్డికి వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
ప్రణీత రెడ్డి, రోహిత్ రెడ్డి, ఇద్దరు పిల్లలు, మరియు అత్త సునీత కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ దుర్ఘటనలో ప్రణీత, పెద్ద కుమారుడు హర్వీన్, సునీత అక్కడికక్కడే మృతిచెందారు.
అయితే, రోహిత్ రెడ్డి, చిన్న కుమారుడు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
ప్రమాదం జరిగిన సమయంలో కారు రోహిత్ రెడ్డి నడుపుతున్నారు.
ఈ విషాదకర ఘటన టేకులపల్లి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం
— BIG TV Breaking News (@bigtvtelugu) March 17, 2025
ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం
మృతులు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లికి చెందిన ప్రగతి రెడ్డి (35), ఆమె కుమారుడు హార్వీన్ (6), అత్త సునీత (56) మృతి pic.twitter.com/nigxfkzDtE