Page Loader
Road Accident : సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది భారతీయులు దుర్మరణం 
సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది భారతీయులు దుర్మరణం

Road Accident : సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది భారతీయులు దుర్మరణం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 29, 2025
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌదీ అరేబియాలోని జిజాన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు జెడ్డాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మృతుల కుటుంబ సభ్యులతో పాటు భారత్‌లోని అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నట్లు తెలిపింది. వారికి పూర్తి సహాయాన్ని అందిస్తున్నామని 'ఎక్స్‌' ద్వారా ప్రకటించింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? మృతులు ఏ ప్రాంతాలకు చెందినవారనే వివరాలు ఇంకా తెలియరాలేదు. సౌదీ అరేబియాలోని జిజాన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది భారతీయులు మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Details

బాధిత కుటుంబాలకు పూర్తి సాయం

బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాల ఆకాంక్షించారు. జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహాయాన్ని అందిస్తోందన్నారు. మరిన్ని వివరాల కోసం టోల్ ఫ్రీ 8002440003, 0122614093, 0126614276, 0556122301 నెంబర్లు ఏర్పాటు చేశారు. ఈ విషాద ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ కూడా స్పందించారు. ఈ ప్రమాదంలో భారతీయుల మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. బాధిత కుటుంబాలకు పూర్తి సహాయం అందించేందుకు జెడ్డాలోని భారత రాయబార కార్యాలయం నిరంతరం అధికారులతో టచ్‌లో ఉందని పేర్కొన్నారు.