తదుపరి వార్తా కథనం

Road accident: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 17, 2025
01:45 pm
ఈ వార్తాకథనం ఏంటి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో చిన్నారి సహా ఏడుగురు ప్రాణాలను కోల్పోయారు. రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చిన టిప్పర్ కారును ఢీ కొట్టి కొద్దిదూరం తీసుకెళ్లింది. కారు టిప్పర్ కిందకి వెళ్లడంతో అందులో ఉన్న మృతదేహాలు నుజ్జునుజ్జయయ్యాయి. కారులో ఉన్న వ్యక్తులు నెల్లూరు నుంచి కడప వైపు వెళ్లుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరి సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం మృతుల వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.