India vs Namibia: నేడు నమీబియాతో భారత్ పోరు.. ఓపెనర్‌గా ఊహించని ప్లేయర్
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా భారత్ ఈరోజు నమీబియాతో తలపడనుంది. ఢిల్లీలో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. టోర్నీలో తొలి మ్యాచ్‌లో అమెరికా ఎదుట బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన టీమిండియా, నమీబియాపై మాత్రం దూకుడు చూపించాలని భావిస్తోంది. భారత్‌తో పోలిస్తే నమీబియా బలహీన జట్టే అయినప్పటికీ, తొలి మ్యాచ్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని భారత జట్టు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఢిల్లీ పిచ్‌పై భారత బ్యాటర్లు భారీ స్కోరు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ రెండో మ్యాచ్‌లో కొందరు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.
వివరాలు
ఫుడ్ ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరం
నమీబియాతో జరిగే మ్యాచ్‌కు ముందు టీమిండియా తుది జట్టుపై ఓ ముఖ్యమైన సమాచారం బయటకు వచ్చింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఫుడ్ ఇన్ఫెక్షన్ కారణంగా మంగళవారం అతను ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం డిశ్చార్జ్ అయినప్పటికీ, పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌లో అతను ఆడటం లేదు. దీంతో సంజూ శాంసన్‌కు తుది జట్టులో స్థానం ఖాయమైంది. అలాగే ఓపెనర్‌గా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ఆడించే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తంగా సుందర్ మళ్లీ జట్టులోకి వచ్చి నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు.
వివరాలు
ప్లేయింగ్ ఎలెవన్‌లోకి జస్ప్రీత్ బుమ్రా
ఇక ఇషాన్ కిషన్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో ఆడతాడా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. అతని ఫిట్‌నెస్‌పై అనుమానాలు కొనసాగుతున్నాయి. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ స్థానాల్లో సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం దక్కనుంది. మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రావడంతో బౌలింగ్ విభాగం మరింత బలపడనుంది. అయితే బుమ్రా రీఎంట్రీతో మహ్మద్ సిరాజ్ తుది జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ మార్పుల మధ్య నమీబియాతో మ్యాచ్‌లో టీమిండియా ఎలా ఆడుతుందన్నది అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది. బుమ్రా, సుందర్ తిరిగి రావడం జట్టుకు కీలక బలంగా మారుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
తుది జట్టు (అంచనా):
సంజూ శాంసన్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్.