NBK : నందమూరి అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్.. బాలయ్య-వివేక్ ఆత్రేయ కాంబో ఫిక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి అభిమానులకు ఇది నిజంగా ఊహించని పెద్ద సర్ప్రైజ్‌గా మారింది. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నందమూరి బాలకృష్ణ, విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ కలిసి ఓ సినిమా చేయనున్నారన్న వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బాలయ్య అంటే మాస్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది తెలిసిందే. మరోవైపు 'సరిపోదా శనివారం'తో ఊరమాస్ హిట్ కొట్టి తనలోని మరో కోణాన్ని చూపించిన వివేక్ ఆత్రేయ, కథా బలంతో పాటు మాస్ ఎలిమెంట్స్‌ను కూడా చక్కగా హ్యాండిల్ చేయగలనని నిరూపించారు. ఈ ఇద్దరి కాంబినేషన్ తెరపై ఎలా ఉండబోతోందనే ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
వివరాలు
వివేక్ స్టైల్ స్క్రీన్‌ప్లేకు బాలయ్య ఇమేజ్
ఇప్పటివరకు 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా', 'అంటే సుందరానికీ' వంటి చిత్రాలతో తనదైన సెన్సిబిలిటీని చూపించిన వివేక్ ఆత్రేయ, తాజాగా 'గాడ్ ఆఫ్ మాస్'గా అభిమానులు పిలిచే బాలయ్యను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకోవడం విశేషం. వివేక్ స్టైల్ స్క్రీన్‌ప్లేకు బాలయ్య ఇమేజ్ జతకలిస్తే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.
వివరాలు
అధికారిక ప్రకటన త్వరలోనే..
ఇప్పటికే బాలయ్యతో 'వీరసింహారెడ్డి' వంటి భారీ విజయాన్ని అందుకున్న ఈ సంస్థ, మరోసారి పెద్ద బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ చిత్రం పూర్తైన వెంటనే వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్యను పూర్తిగా కొత్త కోణంలో చూపించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు,అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశముంది.