LOADING...
Direct tax collections: ఫిబ్రవరి 10 నాటికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.19.44 లక్షల కోట్లు
ఫిబ్రవరి 10 నాటికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.19.44 లక్షల కోట్లు

Direct tax collections: ఫిబ్రవరి 10 నాటికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.19.44 లక్షల కోట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2026
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఫిబ్రవరి 10 వరకు నికరంగా రూ.19.44 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ వసూళ్లు 9.4 శాతం మేర పెరిగినట్లు ఆదాయపు పన్ను శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల్లో స్పష్టమైంది. మొత్తం పన్ను ఆదాయంలో కార్పొరేట్‌ పన్నుల ద్వారా రూ.8.90 లక్షల కోట్లు వసూలవగా, ఇది 14.51 శాతం వృద్ధిని సూచిస్తోంది. అలాగే వ్యక్తిగత ఆదాయపు పన్ను,హిందూ అవిభాజ్య కుటుంబాల (HUF) నుంచి వచ్చిన పన్నులు 5.91 శాతం పెరుగుదలతో రూ.10.03 లక్షల కోట్లకు చేరినట్లు అధికారులు తెలిపారు.

వివరాలు 

రిఫండ్లుగా రూ.3.34 లక్షల కోట్లు చెల్లింపు 

ఇదే కాలంలో ఏప్రిల్‌ 1 నుంచి ఫిబ్రవరి 10 వరకు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (STT) రూపంలో రూ.50,279 కోట్లు వసూలైనట్లు పేర్కొన్నారు. మరోవైపు రిఫండ్లుగా రూ.3.34 లక్షల కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు. మొత్తం స్థూల పన్ను వసూళ్లు ఫిబ్రవరి 10 నాటికి రూ.22.78 లక్షల కోట్లుగా ఉన్నాయని తెలిపారు. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి సవరించిన బడ్జెట్‌ అంచనాల ప్రకారం ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.24.84 లక్షల కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.

Advertisement