LOADING...
Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు వైద్యులు దుర్మరణం
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు వైద్యులు దుర్మరణం

Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు వైద్యులు దుర్మరణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2024
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

అనంతపురం జిల్లా విడపనకల్లు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జుగా మారింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా మారింది. తీవ్రమైన మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Details

మృతులు బళ్లారి వాసులగా గుర్తింపు

మృతులను బళ్లారి నివాసితులైన వైద్యులు యోగేశ్, గోవిందరాయ, అమరేశ్‌గా గుర్తించారు. వారు హాంకాంగ్ విహారయాత్ర ముగించుకుని స్వదేశానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ విషాదకర ఘటన కుటుంబ సభ్యులను, సహచరులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రమాదానికి గల కారణాలను పూర్తిగా తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement