తదుపరి వార్తా కథనం

Road Accident: అనంతపురం జిల్లాలో లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు స్పాట్ డెడ్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 26, 2024
05:07 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద ఓ కారు టైరు పగిలి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు దురదృష్టవశాత్తూ అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులంతా అనంతపురం నుంచి తాడిపత్రిలో నిర్వహించిన నగర కీర్తన వేడుకలో పాల్గొని తిరుగు వస్తుండగా ఈ పెను విషాదం జరిగింది.
ప్రమాదానికి గురైన వారు అనంతపురానికి చెందిన భక్తులుగా గుర్తించారు.