Sowmya Accident : ఫ్లోరిడాలో యాదాద్రి జిల్లా అమ్మాయి దుర్మరణం
వ్రాసిన వారు
Stalin
May 27, 2024
07:03 pm
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని ఫ్లోరిడాలో తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లా అమ్మాయి సౌమ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 25 ఏళ్ల గుంటిపల్లి సౌమ్యను వేగంగా వచ్చి కారు ఢీకొంది. ఈ ఘటన ఆదివారం జరిగింది. ఆమెఫ్లోరిడా అట్లాంటికా యూనివర్శిటీలో ఎంఎస్ పూర్తి చేశారు. మే 11న తన పుట్టిన రోజు జరుపుకుంది. కన్సల్టెంట్ ద్వారా ఉద్యోగం కోసంసౌమ్య ప్రయత్నం చేస్తుంది. తల్లి బాలమణి , ఇతర కుటుంబ సభ్యులు మృత దేహం తెప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆమె తండ్రి కోటేశ్వరరావు ఈ మేరకు విదేశాంగ మంత్రి జై శంకర్ కు విన్నవించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి