LOADING...
#NewsBytesExplainer: ప్రైవేట్,ఆర్టీసీ బస్సుల్లో భద్రత లేదు.. ప్రాణాలకు రక్షణెక్కడ.. అసలు సమస్యేంటి? ఎందుకిలా జరుగుతోంది?
అసలు సమస్యేంటి? ఎందుకిలా జరుగుతోంది?

#NewsBytesExplainer: ప్రైవేట్,ఆర్టీసీ బస్సుల్లో భద్రత లేదు.. ప్రాణాలకు రక్షణెక్కడ.. అసలు సమస్యేంటి? ఎందుకిలా జరుగుతోంది?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2025
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

మన దేశం నిజంగా విచిత్రంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నన్ని చట్టాలు, నిబంధనలు మన దగ్గర కూడా ఉన్నాయి. కానీ అమలు మాత్రం ఉండదు. "మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దు" అని చెబుతారు కానీ, ఎవరైనా ఆ నిబంధనను ఉల్లంఘిస్తే, కఠిన చర్యలు తీసుకోవడం అరుదు. ఎక్కువలో ఎక్కువ జరిమానా వేసి వదిలేస్తారు. దాంతో ప్రజల్లో అర్థమవుతున్న సందేశం.. "తాగి డ్రైవ్ చేయండి, ఫైన్ కడితే చాలు" అన్నట్టుగా ఉంది. ఒక్కరికైనా డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేశారా? ఎవరినైనా జైల్లో పెట్టారా? సమాధానం .. దాదాపు ఎవరినీ పెట్టలేదు , రద్దు చేయలేదు! ఇదే మన సమాజానికి పట్టిన వ్యాధి.

వివరాలు 

ప్రయాణికుల ప్రాణాలకు భద్రత

భారతీయులలో "చట్టాలు అమలవుతాయి,శిక్ష తప్పదు" అనే నమ్మకం సరిగ్గా లేదు. ఎందుకంటే మన న్యాయవ్యవస్థలు తీర్పులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తూనే ఉంటాయి. నిందితులు ఏళ్ల తరబడి బయటే తిరుగుతుంటారు.దశాబ్దాల తర్వాత వచ్చే తీర్పులు ప్రజల్లో చట్టాల పట్ల భయం లేకుండా చేశాయి. అందుకే నిబంధనలు పాటించాలనే అవగాహన కూడా తగ్గిపోతుంది.ప్రైవేట్ బస్సైనా,ఆర్టీసీ బస్సైనా.. ప్రయాణికుల ప్రాణాలకు భద్రత అనే హామీ కనిపించడం లేదు. ఇటీవల కర్నూలు ఘటనలో శివకుమార్ అనే వ్యక్తి మద్యం తాగి బైక్ నడిపి డివైడర్‌ను ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు. అతని బైక్ రోడ్డుపై పడిపోవడంతో,ఆ తర్వాత వచ్చిన ప్రైవేట్ బస్సు దానిని ఢీకొట్టి ముందుకి వెళ్ళింది.

వివరాలు 

రోడ్డు భద్రత స్థాయి

డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో బస్సులో అగ్ని ప్రమాదం చెలరేగి 19మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ప్రైవేట్ బస్సుల్లో భద్రత అనే మాటే లేనట్టుగా తేలిపోయింది. దాంతో "ఆర్టీసీ బస్సులోనే సేఫ్ ట్రావెల్"అనే నినాదం మళ్లీ వినిపించింది. అయితే చేవెళ్ల ప్రమాదం కూడా అంతే భయానకంగా ఉంది. ఒక టిప్పర్ లారీ డ్రైవర్ బద్దకంగా, అతివేగంగా వాహనం నడిపి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టి,టిప్పర్ మొత్తం బస్సుపైన పడిపోయాడు. లారీలోని కంకర బస్సులోకి జారిపడి ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారు.ఇక్కడ బస్సు ప్రభుత్వ సంస్థదే అయినా కూడా ఇన్ని ప్రాణాలు చనిపోవడం మన రోడ్డు భద్రత స్థాయి ఏమిటో చెప్పేస్తోంది.

Advertisement

వివరాలు 

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజు వందల బస్సుల్లో.. అధిక ప్రయాణికులు 

ఈ రెండు ఘటనల్లోనూ నిర్లక్ష్యం, మద్యం తాగి డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, రూల్స్ అతిక్రమణ.. ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. చేవెళ్ల ఘటనలో బస్సు డ్రైవర్ తప్పు కనిపించకపోవచ్చు. అసలు బస్సులో 72 మంది ప్రయాణికులను ఎక్కించుకోవడమే నేరం. నిజానికి ఇలాంటి అధిక ప్రయాణికుల రవాణా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజు వందల బస్సుల్లో జరుగుతోంది. ప్రయాణికులు కిక్కిరిసి నిలబడి ప్రయాణించాల్సి వస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులు లాభాలు పెంచుకోవాలని అనుకోవడం తప్పు కాదు. కానీ రూల్స్ అతిక్రమించడం మాత్రం నేరమే. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం అంటే వారి ప్రాణాలను ప్రమాదంలో పడేయడమే. ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకునే అవకాశమే ఉండకపోవడం వల్లే ఎక్కువమంది మరణిస్తున్నారు.

Advertisement

వివరాలు 

జాగ్రత్తలు తప్పనిసరి!

రోడ్ల పరిస్థితులు కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. గుంతలు, వంపులు,ఎత్తుపల్లాలు.. ఇవన్నీ రోడ్లకు సాధారణం. చాలా చోట్ల వీధి దీపాలు వెలగవు. స్పీడ్ బ్రేకర్ల ముందు హెచ్చరిక గీతలు ఉండవు. సిగ్నల్ వద్ద చాలా మంది వాహనాలు ఆపరు.ఇష్టారాజ్యం అయిపోతోంది. చివరికి ప్రజల ప్రాణాలు బలి అవుతున్నాయి. ప్రయాణం అంటేనే భయపడే స్థితి వచ్చింది. ప్రతిసారి ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది,సంతాపం ప్రకటిస్తుంది. కానీ ప్రమాదాలు జరగకముందే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?నెల్లూరు ఘటన తర్వాత మారిందేముంది?

వివరాలు 

చట్టాల పట్ల గౌరవం,నిబంధనల అమలు పట్ల అవగాహన

ఇప్పుడు చేవెళ్ల ఘటన తర్వాత మార్పు వస్తుందా? అనే ప్రశ్నలు మళ్లీ ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వాలు మాత్రమే కాదు, ప్రజలందరిలోనూ చట్టాల పట్ల గౌరవం,నిబంధనల అమలు పట్ల అవగాహన ఉండాలి. లేకపోతే ఇలాంటి విషాదాలు మన కళ్లముందు తిరుగుతూనే ఉంటాయి. చివరికి మిగిలేది కన్నీటి జ్ఞాపకాలే.

Advertisement