NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Sri Lanka: శ్రీలంకలో ఘోర ప్రమాదం.. కొండపై నుంచి బస్సు బోల్తా.. 21 మంది మృతి
    తదుపరి వార్తా కథనం
    Sri Lanka: శ్రీలంకలో ఘోర ప్రమాదం.. కొండపై నుంచి బస్సు బోల్తా.. 21 మంది మృతి
    శ్రీలంకలో ఘోర ప్రమాదం.. కొండపై నుంచి బస్సు బోల్తా.. 21 మంది మృతి

    Sri Lanka: శ్రీలంకలో ఘోర ప్రమాదం.. కొండపై నుంచి బస్సు బోల్తా.. 21 మంది మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 11, 2025
    03:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీలంకలో తేయాకు కొండల ప్రాంతంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ ప్రయాణికుల బస్సు కొండపై నుంచి బోల్తాపడటంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.

    ఈ ఘటనలో మరో 36 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు.

    ఈ దుర్ఘటన రాజధాని కొలంబోకు తూర్పు దిశగా 140 కిలోమీటర్ల దూరంలోని కోట్మలే పట్టణ సమీపంలో ఈ తెల్లవారుజామున చోటుచేసుకుంది.

    శ్రీలంక రహదారులు, రవాణా శాఖ డిప్యూటీ మంత్రి ప్రసన్న గుణసేన మీడియాతో మాట్లాడుతూ.. మృతుల సంఖ్యను 21గా ధృవీకరించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 77 మంది బౌద్ధ యాత్రికులు ఉన్నారని తెలిపారు.

    Details

    క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు

    బస్సు సామర్థ్యానికి మించి 25 మంది అదనంగా ప్రయాణించడమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

    డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ఘటన జరిగిందని స్థానిక పోలీసులు పేర్కొన్నారు.

    ప్రమాదానికి గురైన బస్సు శ్రీలంక ప్రభుత్వ రవాణా సంస్థకు చెందినదని అధికారులు నిర్ధారించారు.

    బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీలంక
    రోడ్డు ప్రమాదం

    తాజా

    Sri Lanka: శ్రీలంకలో ఘోర ప్రమాదం.. కొండపై నుంచి బస్సు బోల్తా.. 21 మంది మృతి శ్రీలంక
    Suriya-Karthi: దర్శకుడు ప్రేమ్ కుమార్ కు 'థార్' గిఫ్ట్.. సర్‌ప్రైజ్ చేసిన సూర్య, కార్తి! సూర్య
    Ukraine: రష్యాతో చర్చలకు సిద్ధం.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన రష్యా
    New Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. మళ్లీ అప్లై చేయనవసరం లేదు! ఆంధ్రప్రదేశ్

    శ్రీలంక

    IND vs SL : భారత్‌పై నాలుగు వికెట్లతో విజృంభించిన మతీషా పతిరనా టీమిండియా
    IND vs SL : మొదటి టీ20లో టీమిండియా సూపర్ విక్టరీ టీమిండియా
    IND vs SL : నేడు రెండో టీ20.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా టీమిండియా
    IND vs SL : ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక గెలుపు.. పోరాడి ఓడిన భారత్ ఆసియా కప్

    రోడ్డు ప్రమాదం

    Ambala Accident:వైష్ణోదేవికి వెళ్తున్న భక్తుల మినీ బస్సును ట్రక్కు ఢీకొని.. ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి హర్యానా
    Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి  ఆంధ్రప్రదేశ్
    Sowmya Accident : ఫ్లోరిడాలో యాదాద్రి జిల్లా అమ్మాయి దుర్మరణం ఫ్లోరిడా
    Jammu Accident: జమ్ములో పెను ప్రమాదం.. బస్సు లోయలో పడి 22 మంది మృతి, 69 మందికి గాయాలు జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025