Yogi Babu:ప్రముఖ కమెడియన్ యోగి బాబుకు యాక్సిడెంట్
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్‌లో తన హాస్య నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ కమెడియన్ యోగి బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.
అయితే తాజాగా ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడం అభిమానుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది.
తమిళనాడులోని రాణి పేట ప్రాంతంలో యోగి బాబు ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి భారీ కేడ్‌ను ఢీ కొట్టింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు రంగప్రవేశం చేసి, తక్షణమే పరిస్థితిని సమీక్షించారు.
Details
అభిమానుల ఆందోళన
ఈ ప్రమాదంపై అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ యోగి బాబు క్షేమంగా ఉన్నారా? అంటూ ఆరా తీశారు.
అయితే పోలీసులు తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం యోగి బాబు సురక్షితంగా ఉన్నారు. దీంతో ఆయన అభిమానులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.
ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ప్రమాదం గురించి యోగి బాబు స్వయంగా స్పందిస్తే ఇంకా ఎక్కువ ఊరట కలుగుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.