తదుపరి వార్తా కథనం
MP Son Arrested: రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ ఎంపీ కుమారుడు అరెస్ట్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 05, 2024
06:02 pm
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ ఎంపీ చంద్రకాంత్ హందోర్ కుమారుడు గణేష్ హందోర్ కారుతో రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
గణేష్ తన కారు చెంబూర్ సమీపంలో గోవండిలోని రోడ్డుపై నడుస్తున్న గోపాల్ అనే వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో గాయపడ్డ గోపాల్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదం ముంబైలో చోటు చేసుకుంది. ప్రమాదం అనంతరం గణేష్‌ను పోలీసులు అరెస్టు చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే అరెస్ట్ అయిన కొద్ది సేపటికే గణేష్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది.
Details
గణేష్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
రక్తంలో చక్కెర స్థాయిలు అధికమవడంతో, అతడిని జేజే హాస్పిటల్‌కు తరలించారు.
ప్రస్తుతానికి అతనికి వైద్యసేవలు అందిస్తున్నారు.
ఈ కేసులో భారతీయ న్యాయసంహిత, మోటారు వాహనాల చట్టంలోని పలు సెక్షన్ల కింద గణేష్‌పై కేసు నమోదు చేశారు.