NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 5 Doctors Killed: ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రక్కును ఢీకొన్న స్కార్పియో.. ఐదుగురు వైద్యులు మృతి
    తదుపరి వార్తా కథనం
    5 Doctors Killed: ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రక్కును ఢీకొన్న స్కార్పియో.. ఐదుగురు వైద్యులు మృతి
    ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రక్కును ఢీకొన్న స్కార్పియో.. ఐదుగురు వైద్యులు మృతి

    5 Doctors Killed: ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రక్కును ఢీకొన్న స్కార్పియో.. ఐదుగురు వైద్యులు మృతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 27, 2024
    10:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కన్నౌజ్‌ జిల్లాలో మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

    ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే పై, కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటి, అటువైపు వస్తున్న ట్రక్కును ఢీకొన్నది.

    ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారంతా సైఫాయి మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్ధులు.

    ప్రమాదం జరిగిన సమయంలో, లక్నోలో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరైన విద్యార్థులు, సైఫాయికి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

    సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఐదుగురు మృతి చెందినట్లు ధృవీకరించారు.

    వివరాలు 

    నిద్రమత్తులో స్కార్పియో డ్రైవర్ 

    ఈ ప్రమాదానికి కారణం స్కార్పియో డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

    ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో డాక్టర్ అనిరుధ్ వర్మ, డాక్టర్ సంతోష్ కుమార్ మౌర్య, డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ నార్దేవ్, ఒక గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారు.

    ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మొరాదాబాద్‌లోని బుద్ధ విహార్‌కు చెందిన కరణ్ సింగ్ కుమారుడు జైవీర్ సింగ్. మృతదేహాలను ప్రస్తుతం మార్చురీలో ఉంచారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    రోడ్డు ప్రమాదం

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    ఉత్తర్‌ప్రదేశ్

    UP Serial Killer : తొమ్మిది మహిళలను చంపిన 'సీరియల్ కిల్లర్' అరెస్ట్ ఇండియా
    Sabarmati Express: పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్.. ఏడు రైళ్లు రద్దు రైలు ప్రమాదం
    Road accident: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం ఇండియా
    Uttar Pradesh : యూపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం.. రెండుగా విడిపోయిన కిసాన్ ఎక్స్‌ప్రెస్ ఇండియా

    రోడ్డు ప్రమాదం

    Car Accident: అదుపుతప్పి మార్కెట్ లోకి దూసుకెళ్లిన కారు... ఒకరు మృతి  దిల్లీ
    Afghanistan: రోడ్డు ప్రమాదంలో బస్సు బోల్తా, 21 మంది మృతి ఆఫ్ఘనిస్తాన్
    Car Overturned In Begusarai: హోలీ పండుగ రోజు విషాదం.. కారు గోతిలో బోల్తా పడి కుటుంబంలోని ముగ్గురు మృతి  బిహార్
    Haryana: హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా... 5గురు చిన్నారులు మృతి హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025