Womens T20 World Cup: Womens T20 World Cup: ఫైనల్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియాతో ఆఖరిపోరుకు రెడీ
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 40 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. జట్టు కెప్టెన్ బ్రంట్ 75 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, హెథర్ నైట్ 58 పరుగులతో కీలక సహకారం అందించారు. డానీ వ్యాట్ 12, జోన్స్ 2 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నీమ్ ఇస్మాయిల్ ఐదు వికెట్లు పడగొట్టి రాణించగా, మరిజేన్ కాప్, అయబొంగ ఖాక తలో వికెట్ సాధించారు.
వివరాలు
రసవత్తర పోరు..
170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులకే పరిమితమైంది. టజ్మిన్ బ్రిట్స్ 51 పరుగులతో అర్ధశతకం నమోదు చేయగా, వోల్వార్ట్ 17, నాదిన్ డి క్లర్క్ 14, ట్రియన్ 12 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లారెన్ బెల్, షార్లెట్ డీన్ చెరో రెండు వికెట్లు దక్కించుకోగా, లిన్సే స్మిత్, సోఫీ, కెంప్ తలో వికెట్ తీసి జట్టు విజయానికి తోడ్పడ్డారు. ఈ విజయంతో ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరుకోగా, టైటిల్ పోరులో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీఫైనల్‌లో వెస్టిండీస్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఇప్పటికే ఫైనల్‌లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.