గుజరాత్: వార్తలు

గుజరాత్‌లోని సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపు వైరల్ అవుతున్న వీడియో

మామూలుగా సింహం లేదా పులి జింక లేదా మేకను వేటాడే వీడియోలను చూసి ఉంటారు, ఈ వీడియోలో వీధుల నుండి సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపుని చూడచ్చు. వీడియో ప్రకారం ఈ ఘటన అర్థరాత్రి జరిగినట్లు తెలుస్తోంది.

'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ ఆరోపణలు; రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019లో మోదీ ఇంటి పేరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల నేపథ్యంలో అదే ఏడాది రాహుల్‌పై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ చేసిన ఫిర్యాదు మేరకు పరువు నష్టం కేసు నమోదైంది.

కిరణ్ పటేల్‌: పీఎంఓ అధికారినంటూ హల్‌చల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు; 15రోజుల జ్యుడీషియల్ కస్టడీ

ప్రధానమంత్రి కార్యాలయం( పీఎంఓ)అధికారిగా నటించి అడ్డంగా దొరికిపోయిన గుజరాత్‌కు చెందిన కిరణ్ పటేల్‌ను శుక్రవారం శ్రీనగర్ కోర్టు 15రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

దేశంలో పెరుగుతున్న హెచ్‌3ఎన్2 వైరస్ మరణాలు; మొత్తం ఏడుగురు మృతి

దేశంలో హెచ్‌3ఎన్2 ఇన్‌ప్లూయెంజా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవతున్నారు. అయితే ఈ ఇన్‌ప్లూయెంజా వైరస్ సోకి మరణాలు సంభవిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

ప్రధాని మోదీ తమ్ముడు ప్రహ్లాద్‌కు అస్వస్థత; చెన్నైలోని ఆస్పత్రిలో చేరిక

ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కొత్త టెక్నాలజీ

భావ్‌నగర్‌కు చెందిన సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSMCRI) అద్భుతమైన ఆవిష్కరణ మెమ్బ్రేన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఇది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వ్యయాన్ని భారీగా తగ్గించి, భవిష్యత్తులో గ్రీన్ ఇంధనంగా మారే అవకాశం ఉంది.

మోర్బి వంతెనపై 'సిట్' నివేదిక: కూలిపోవడానికి ముందే సగం కేబుల్స్ తెగిపోయాయి

గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో గతేడాది అక్టోబర్ 30న కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 135 మంది మృతిన ఈ ఘటనపై విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుజరాత్ హైకోర్టుకు సోమవారం నివేదికను సమర్పించింది.

14 Feb 2023

బీబీసీ

BBC: బీబీసీ దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ బృందాల సోదాలు

ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు మంగళవారం దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.

తయారీ లోపాలతో అమెరికాలో 34వేల జనరిక్ ఔషధాల బాటిళ్లను వెనక్కి రప్పించిన సన్ ఫార్మా

US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ ప్రకారం, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ US-ఆధారిత విభాగం ఆంజినా, అధిక రక్తపోటు కొన్ని రకాల గుండె చికిత్సలకు ఉపయోగించే Diltiazem హైడ్రోక్లోరైడ్ క్యాప్సూల్స్‌ను వెనక్కి రప్పిస్తుంది.

10 Feb 2023

ముంబై

ముంబై బుల్లెట్ రైలుకు మొట్టమొదటి అండర్ సీ టన్నెల్ 3-అంతస్తుల స్టేషన్‌

బుల్లెట్ రైలు పని మహారాష్ట్రలో వేగాన్ని పుంజుకుంది, దీనిని బాంబే హైకోర్టు "జాతీయ ప్రాముఖ్యత మరియు ప్రజా ప్రయోజనానికి సంబంధించిన" ప్రాజెక్ట్ అని పేర్కొంది.

బీబీబీ డాక్యుమెంటరీని నిషేధించడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధించడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీబీసీ డాక్యుమెంటరీ నిషేధానికి వ్యతిరేకంగా మహువా మోయిత్రా, జర్నలిస్టు ఎన్‌ రామ్‌, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, న్యాయవాది ఎంఎల్‌ శర్మ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది.

Asaram Bapu: అత్యాచార కేసులో ఆశారాం బాపునకు జీవిత ఖైదు

అత్యాచార కేసులో ఆశారాం బాపునకు గుజరాత్‌లోని గాంధీనగర్ సెషన్స్ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ఇప్పటికే ఆశారాం బాపును కోర్టు ఇప్పటికే దోషిగా తేల్చగా తాజాగా శిక్షను ఖరారు చేసింది.

బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టులో విచారణ

ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

banned documentaries: భారత్‌లో నిషేధించిన ఈ ఐదు డాక్యుమెంటరీల గురించి తెలుసుకోండి

2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో డాక్యుమెంటరీని రూపొందించింది. డాక్యుమెంటరీ వీడియో లింకులపై కేంద్రం నిషేధం విధించింది. బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గుజరాత్: దంపతులు వెళ్తున్న బైక్‌ను ఢీకొని, భర్తను 12కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు

దిల్లీలోని సుల్తాన్‌పురిలో అంజలిని కారు ఢీకొట్టి 13 కిలోమీటర్లు లాక్కెళ్లిన తరహా ఘటన తాజాగా గుజరాత్‌లో జరిగింది. సూరత్‌లో దంపతులు వెళ్తున్న బైక్‌ను ఓ కారు ఢీకొట్టి, బైకర్‌ను దాదాపు 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడిక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలైన ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

జేఎన్‌యూలో హై టెన్షన్: మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని చూస్తున్న విద్యార్థులపై రాళ్లదాడి

దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) క్యాంపస్‌లో ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శన నేపథ్యంలో మంగళవారం రాత్రి హై డ్రామా జరిగింది. వామపక్ష విద్యార్థులు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో బీబీసీ డాక్యుమెంటరీని చూసేందుకు గుమికూడగా వారిపై రాళ్లదాడి జరిగింది. దీంతో జేఎన్‌యూలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

'పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదు?' మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనపై మున్సిపాలిటీకి షాకాజ్ నోటీసులు

గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై స్థానిక మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విధుల నిర్వహణలో ఘోరంగా విఫమైన మున్సిపాలిటీ పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఆ నోటీసుల్లో పేర్కొంది.

గుజరాత్: రూ. కోట్లలో ఆస్తిని త్యజించి సన్యాసాన్ని స్వీకరించిన బాలిక

తండ్రి వజ్రాల వ్యాపారి, రూ. కోట్లలో ఆస్తి, విసాలవంతమైన జీవితం, ఏది కావాలన్నా క్షణాల్లో తెచిపెట్టే తల్లిదండ్రులు.. వీటన్నింటి త్యజించి, ఎనిమిదేళ్లకే భక్తి మార్గంలో నడవాలని నిర్ణయించుకుంది ఓ బాలిక. అనుకున్న విధంగానే జైన సన్యాసాన్ని స్వీకరించింది. ఈ అసాధారణ ఘటన గుజరాత్‌లో జరిగింది.

16 Jan 2023

ఐపీఎల్

నా ఆస్తులకు వారుసుడు రుచిర్, తక్షణమే అమల్లోకి వస్తుంది: లలిత్ మోదీ

కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ కీలక ప్రకటన చేశారు. తాను విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పిన ఆయన.. ట్విట్టర్ వేదికగా తన ఆస్థులకు వారసుడిగా కుమారుడు రుచిర్ మోదీని ప్రకటించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది చెప్పారు.

మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్

ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబేన్(100) కన్నుమూశారు. ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆ తర్వాత కోలుకొని డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున ఆరోగ్యం విషమించడంతో ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ బుధవారం అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ & రీసెర్చ్ సెంటర్‌కు తరలించారు.