Gujarat: బాలచాడి సైనిక్ స్కూల్‌లో ర్యాగింగ్ కలకలం.. జూనియర్లపై సీనియర్ల దాడి వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్‌లోని బాలచాడి సైనిక పాఠశాలలో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సీనియర్లు జూనియర్ విద్యార్థులను బలవంతంగా శిక్షించడంతో పాటు కర్రలతో దాడి చేశారు. ఈసంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్‌మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతుంది. వీడియో బయటకు రావడంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రఆందోళన వ్యక్తం చేశారు. వీడియోలో ఒక సీనియర్ విద్యార్థి టవల్ కప్పుకొని కనిపించాడు.అతడు జూనియర్ విద్యార్థులను పుష్‌అప్స్ చేయాలని బలవంతం చేశాడు. ఆపొజిషన్‌లో ఉన్న వారిని వరుసగా కర్రతో కొట్టాడు.ఈదాడితో కొందరు జూనియర్ విద్యార్థులు నొప్పితో వేదన చెందుతూ కనిపించారు. ఈవీడియో వైరల్ కావడంతో రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సైనిక పాఠశాలలో ఇలాంటి ర్యాగింగ్ జరుగుతుందనే విషయంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాలు
12 ఏళ్ల జూనియర్ విద్యార్థిపై చోరీ ఆరోపణలు
పెరిగిన విమర్శల నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం స్పందించింది. ఈ ఘటనపై అంతర్గత విచారణను ప్రారంభించినట్టు తెలిపింది. ఇదిలా ఉండగా, అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు సియాంగ్ జిల్లాలో ఉన్న మరో సైనిక పాఠశాలలో కూడా ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. ఏడో తరగతి చదువుతున్న 12 ఏళ్ల జూనియర్ విద్యార్థిపై చోరీ ఆరోపణలు చేసి, 8వ, 10వ తరగతి సీనియర్ విద్యార్థులు అతడిని తీవ్రంగా హింసించారు. ఈ క్రమంలో మానసిక వేదనను తట్టుకోలేకపోయిన ఆ బాలుడు నవంబర్ 1న ఒక సూసైడ్ నోట్ రాసి పాఠశాల ప్రాంగణంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్ ఇదే..
શિસ્ત માટે જાણીતી બાલાચડી સૈનિક સ્કૂલ આવી વિવાદમાં: સ્કૂલમાં સિનિયર વિધાર્થી દ્વારા જુનિયર વિધાર્થીને માર મારવામાં આવતો હોવાનો વિડિઓ વાયરલ..#gujaratmirror #rajkot #rajkotcitypolice #students #viralvideo pic.twitter.com/COtJk23Iah
— Gujarat Mirror (@gujaratmirror26) November 5, 2025