LOADING...
Cop Slaps Boy: సూరత్‌లో మోడీ కాన్వాయ్ రిహార్సల్‌.. సైకిల్ తొక్కిన బాలుడిని చితకబాదిన పోలీసులు!
సూరత్‌లో మోడీ కాన్వాయ్ రిహార్సల్‌.. సైకిల్ తొక్కిన బాలుడిని చితకబాదిన పోలీసులు!

Cop Slaps Boy: సూరత్‌లో మోడీ కాన్వాయ్ రిహార్సల్‌.. సైకిల్ తొక్కిన బాలుడిని చితకబాదిన పోలీసులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 08, 2025
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటన సందర్భంగా సూరత్‌లో మోడీ కాన్వాయ్ రిహార్సల్ జరిగింది. అయితే, ఈ రిహార్సల్ సమయంలో ఓ 17 ఏళ్ల బాలుడు సైకిల్ తొక్కుతూ రోడ్డుపైకి రావడం పోలీసుల దాడికి దారితీసింది. బాలుడిని అడ్డుకున్న సబ్-ఇన్స్పెక్టర్ బీఎస్ గధ్వి, బాలుడిపై అనుచితంగా ప్రవర్తించాడు. తల, ముఖంపై పిడుగుదాడులు చేస్తూ చెంపదెబ్బల వర్షం కురిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

details

తల్లిదండ్రుల ఆవేదన

సూరత్‌లోని రతన్ చౌక్ వద్ద కాన్వాయ్ రిహార్సల్ జరుగుతుండగా, సైకిల్ తొక్కుతున్న బాలుడిని గధ్వి అడ్డుకొని చెంపదెబ్బ కొట్టాడు. దాడితో ఆగకుండా, పోలీస్ స్టేషన్‌కు తరలించి రాత్రివరకు అక్కడే ఉంచారు. ఆ బాలుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. రాత్రి 9:30 గంటలకు బాలుడు ఏడుస్తూ ఇంటికి చేరుకున్నాడు. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా, పోలీసుల తీరు పట్ల వారు మండిపడ్డారు. ఏదైనా తప్పు చేస్తే కౌన్సెలింగ్ మందలించాలని కానీ చిన్నపిల్లాడిని రాత్రివరకు స్టేషన్‌లో ఉంచడం ఏమిటని తల్లిదండ్రులు పోలీసులను ప్రశ్నించారు.

Details

భగ్గుమన్న ప్రజలు

ఈ ఘటనపై స్థానిక ప్రజలు భగ్గుమన్నారు. సీసీ కెమెరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పోలీసుల తీరుపై విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమిత్ వనాని ఈ ఘటనను ఖండించారు. సబ్-ఇన్స్పెక్టర్ బీఎస్ గధ్వి ప్రవర్తన అనుచితంగా ఉందని, తక్షణమే గధ్విని మోర్బి జిల్లాలోని కంట్రోల్ రూమ్‌కు బదిలీ చేశామన్నారు. ఇక గధ్వికి పెరిగిన జీతాన్ని ఒక ఏడాది పాటు నిలిపివేశామన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్