Rajasthan: సింపుల్ వెడ్డింగ్‌తో ఆదర్శంగా నిలిచిన ఐఏఎస్ అధికారులు
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 20, 2026
10:44 am
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పటి కాలంలో వివాహాలను ఎంతో వైభవంగా,హంగులు ఆర్భాటాలతో నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్న పరిస్థితుల్లో,ఇద్దరు ఐఏఎస్ అధికారులు మాత్రం ఎంతో సాధారణంగా దండలు మార్చుకుని దాంపత్య జీవితం ప్రారంభించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లా కలెక్టర్ డాక్టర్ అర్తికా శుక్లా సమక్షంలో ఈ వివాహ వేడుక సాదాసీదాగా జరిగింది. 2023 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈ వధూవరులు శిక్షణ కాలంలోనే పరిచయం పెంచుకుని,ఆ పరిచయం ప్రేమగా మారింది. ఉత్తరాఖండ్‌కు చెందిన వరుడు మాధవ్ భరద్వాజ్ ప్రస్తుతం అల్వార్ జిల్లాలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం)గా పనిచేస్తుండగా,ఉత్తరప్రదేశ్‌కు చెందిన వధువు అదితి గుజరాత్ రాష్ట్రంలోని జామ్‌నగర్‌లో ఎస్‌డీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ వివాహానికి ఇరువురి తల్లిదండ్రులు,కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరై ఆశీర్వదించారు.