LOADING...
Donald Trump: ట్రంప్‌ మరో వివాదాస్పద పోస్ట్‌.. ఒబామాపై మార్ఫింగ్‌ ఫొటో వైరల్
ట్రంప్‌ మరో వివాదాస్పద పోస్ట్‌.. ఒబామాపై మార్ఫింగ్‌ ఫొటో వైరల్

Donald Trump: ట్రంప్‌ మరో వివాదాస్పద పోస్ట్‌.. ఒబామాపై మార్ఫింగ్‌ ఫొటో వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సోషల్‌ మీడియాలో చేసిన పోస్టుతో వివాదానికి కేంద్రబిందువయ్యారు. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా,ఆయన భార్య మిషెల్‌ ఒబామాను లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్‌ చేసిన చిత్రాన్ని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ ఖాతాలో పంచుకున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. ట్రంప్‌ షేర్‌ చేసిన చిత్రంలో ఒబామా దంపతులు ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలోని మెట్లపై నిలబడి చిరునవ్వుతో చేతులు ఊపుతున్నట్లు చూపించారు. వారి వెనుక ఉన్న విమానంపై గ్రాఫిటీ శైలిలో'Yes We Can','Obama','BLM (Black Lives Matter)'వంటి పదాలు, రాజకీయ నినాదాలు, ఇతర వ్యాఖ్యలను చేర్చినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం జాతి వివక్షను ప్రోత్సహించే సంకేతాలు ఉన్నాయంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

వివరాలు 

ఇటలీ ప్రధానికి సంబంధించిన మరో మార్ఫింగ్‌ చిత్రం

ఈ పోస్టు వైరల్‌ కావడంతో సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని రాజకీయ వ్యంగ్యంగా అభివర్ణిస్తుండగా, మరికొందరు ఇందులో జాతి వివక్షను ప్రోత్సహించే సంకేతాలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. దీంతో ట్రంప్‌ పోస్టుపై మళ్లీ రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ మొదలైంది. అదే సమయంలో ట్రంప్‌ షేర్‌ చేసిన పోస్టుల్లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి సంబంధించిన మరో మార్ఫింగ్‌ చిత్రం కూడా చోటు చేసుకుంది. ఆ చిత్రంలో మెలోనీ ట్రంప్‌ వైపు చిరునవ్వుతో చూస్తున్నట్లు చూపిస్తూ, 'Restraining Order Needed' అనే క్యాప్షన్‌ను జత చేశారు. ఈ పోస్టు కూడా సోషల్‌ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది.

Advertisement