Raging in MBBS College: గుజరాత్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి మృతి
గుజరాత్ రాష్ట్రం పటాన్‌లోని ధర్‌పూర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కారణంగా ఓ విద్యార్థి మృతి చెందారు. సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ చేయడంతో మొదటి సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థి అనిల్ మెథానియా మృతి చెందాడు. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం 15 మంది సీనియర్ విద్యార్థులను అకడమిక్, హాస్టల్ కార్యకలాపాల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. నవంబర్ 1న జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరణ ఇచ్చారు. రాత్రి 8:30 గంటలకు సీనియర్ విద్యార్థులు తొలి సంవత్సరం విద్యార్థులను హాస్టల్‌కు పిలిపించి పరిచయం పేరుతో ర్యాగింగ్ చేశారు. ర్యాగింగ్‌లో భాగంగా అనిల్‌ను గాయపరిచేలా మానసిక, శారీరకంగా ఒత్తిడి కలిగించారు. పాటలు పాడమని, డ్యాన్స్ చేయమని ఒత్తిడి చేశారు.
విద్యార్థులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
అనిల్‌ను మూడు గంటల పాటు నిల్చోబెట్టారు. ఈ సమయంలో అనిల్ తల తిరగడంతో కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 15 మంది సీనియర్ విద్యార్థులపై 105, 127(2), 189(2), 190, 296(బి) సెక్షన్‌ల కింద కేసు** నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ చర్యలు తీసుకుంటామని 'డిప్యూటీ ఎస్పీ కేకే పాండ్యా' తెలిపారు. కాలేజీ యాజమాన్యం మాట్లాడుతూ ర్యాగింగ్ నిరోధానికి అంటీ ర్యాగింగ్ కమిటీ చర్యలు చేపడుతోందని, ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపుతామని హామీ ఇచ్చింది. ఇలాంటి ఘటనలు విద్యార్థుల భవిష్యత్తుపై చెడు ప్రభావం చూపుతాయని, ర్యాగింగ్‌ను పూర్తిగా నిషేధించేందుకు కఠిన చట్టాలను అమలు చేయాలని సామాజికవర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.