Page Loader
Bypolls 2025: ఆ నాలుగు రాష్ట్రాల్లో బైఎలక్షన్స్.. ఈసీ షెడ్యూల్ విడుదల
ఆ నాలుగు రాష్ట్రాల్లో బైఎలక్షన్స్.. ఈసీ షెడ్యూల్ విడుదల

Bypolls 2025: ఆ నాలుగు రాష్ట్రాల్లో బైఎలక్షన్స్.. ఈసీ షెడ్యూల్ విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
May 25, 2025
03:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో మరోసారి ఎన్నికల జోష్‌ నెలకొననుంది. భారత ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ బైపోల్స్‌ కోసం జూన్ 19న పోలింగ్‌ నిర్వహించనుండగా, జూన్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ స్పష్టంచేసింది. గుజరాత్‌లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కాడి నియోజక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కర్సన్‌ భాయ్ పంజాభాయ్ సోలంకి మృతి చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

Details

 పశ్చిమ బెంగాల్‌లో కలిగంజ్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక

మరోవైపు విశావదర్ నియోజక వర్గానికి చెందిన ఎమ్మెల్యే భయానీ భూపేంద్ర భాయ్ గండుభాయ్ రాజీనామా చేయడంతో ఈ స్థానానికి కూడా ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. కేరళలోని నీలంబూర్ అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే పీవి అన్వర్ రాజీనామాతో ఉప ఎన్నిక జరగనుంది. పంజాబ్‌లో లూథియానా అసెంబ్లీ నియోజక వర్గం ఎమ్మెల్యే గురుప్రీత్ బస్సీ గోగి మృతి చెందగా, అక్కడ కూడా బైఎలక్షన్ నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్‌లో కలిగంజ్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది.

Details

మే 26న నామినేషన్ ప్రక్రియ ప్రారంభం

ఇదిలా ఉండగా, గుజరాత్ పీసీసీ చీఫ్ శక్తిసిన్హ్ గోహిల్ గతంలో చేసిన ప్రకటన ప్రకారం, ఇండియా కూటమి భాగస్వామిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు లేకుండా కాంగ్రెస్ పార్టీ కాడి, విశావదర్ నియోజక వర్గాల్లో స్వతంత్రంగా పోటీ చేయనుంది. ఈ ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, నామినేషన్ల ప్రక్రియ మే 26న ప్రారంభం కానుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ జూన్ 2గా నిర్ణయించగా, జూన్ 3న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా జూన్ 5ని ఎన్నికల సంఘం ప్రకటించింది.