పశ్చిమ బెంగాల్: వార్తలు

2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. తాను ఏ పార్టీతోనూ చేతులు కలపబోనని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించారు.

'తృణమూల్ కాంగ్రెస్' ట్విట్టర్ ఖాతా హ్యాక్; పేరు, లోగో మార్పు

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా మంగళవారం హ్యాక్ అయ్యింది. పార్టీ ఖాతా పేరు మార్పు, లోగోను హ్యాకర్లు మార్చారు.

Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్

మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది.ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల ఎదుట బారులుదీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని 15 కొత్త నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G

భారతి ఎయిర్‌టెల్ పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్, దుర్గాపూర్, దిన్హటా, అసన్సోల్, జల్పైగురి, డార్జిలింగ్‌తో సహా మరో 15 నగరాల్లో తన 5G సేవలను ప్రారంభించింది. ఎయిర్‌టెల్ తన 5G సేవలను అక్టోబర్ 2022లో ప్రారంభించింది.

08 Feb 2023

లోక్‌సభ

'నాలుకను అదుపులో ఉంచుకోవాలి', తృణమూల్ ఎంపీకి హేమ మాలిని వార్నింగ్

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపి మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ హేమ మాలిని బుధవారం మండిపడ్డారు. అక్షేపణీయమైన పదాన్ని లోక్‌సభలో మహువా ఉపయోగించారని, నాలుకను అదుపులో పెట్టుకొని మాట్లాడలని సూచించారు.

మధ్యాహ్న భోజనంలో పాము.. 30మంది విద్యార్థులకు అస్వస్థత

పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో ఘోరం జరిగింది. విద్యార్థులు తింటున్న మధ్యాహ్న భోజనంలో పాము కనిపించింది. ఈ క్రమంలో ఆ ఆహారం తిన్న 30 మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. మయూరేశ్వర్‌లోని ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

12 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించిన బెంగాల్ ప్రభుత్వం: మమత

కోల్‌కతాలోని రాజర్‌హట్‌లోని బిస్వా బంగ్లా కన్వెన్షన్ సెంటర్‌లో సోమవారం జరిగిన జీ20మొదటి 'గ్లోబల్ పార్టనర్‌షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్' సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగించారు. బెంగాల్ రాష్ట్రం ప్రభుత్వం 12 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించినట్లు చెప్పారు. జీడీపీని అనేక రేట్లను పెంచినట్లు వెల్లడించారు.

టీచర్స్ స్కామ్: 59 మంది ఉపాధ్యాయులను తొలగించాలని హైకోర్టు ఆదేశం

అక్రమ పద్ధతిలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొలువులు సాధించిన వారిపై కోల్‌కతా హైకోర్టు కోరడా ఝులిపించింది. తప్పుడు మార్గాల ద్వారా ఉద్యోగాలను పొందిన 59మందిని విధుల నుంచి తొలగించాలని పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్ల్యూబీఎస్‌ఎస్‌సీ)ను జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశించింది.

పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్

పశ్చిమ బెంగాల్‌లో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 కేసులు వెలుగుచూశాయి. అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు బెంగాల్ ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పింది.

'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి

పశ్చిమ బెంగాల్‌లో హౌరా నుంచి న్యూ జల్‌పాయిగుఢి మధ్య ఇటీవల ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి జరిగింది. మాల్దా జిల్లాలోని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మాల్దా పట్టణానికి 50కిలోమీటర్ల దూరంలో దాడి జరిగనట్లు అధికారులు చెప్పారు.

తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ

కన్నతల్లి అంత్యక్రియలు ముగిసి... రెండు గంటలు కూడా గడవలేదు, అప్పుడే విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. తల్లి చనిపోయిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభించారు.

26 Dec 2022

కోవిడ్

కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు

అంతర్జాతీయ ప్రయాణికుల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం బిహార్ విమానాశ్రయంలో నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలగా.. తాజాగా కోల్‌కతా ఎయిర్ పోర్టులో మరో ఇద్దరికి వైరస్ నిర్ధారణ అయ్యింది.