తదుపరి వార్తా కథనం
Train Derailed: నల్పూర్ స్టేషన్ వద్ద పట్టాలు తప్పిన సికింద్రాబాద్-శాలీమార్ ఎక్స్‌ప్రెస్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 09, 2024
08:47 am
ఈ వార్తాకథనం ఏంటి
సికింద్రాబాద్-శాలీమార్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం నుంచి తప్పించుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని నల్పూర్ స్టేషన్ సమీపంలో ఈ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సౌత్-ఈస్ట్రన్ రైల్వే సీపీఆర్‌వో స్పష్టంచేశారు.
పట్టాలు తప్పిన వాటిలో రెండు ప్రయాణికుల బోగీలు కాగా, ఒక పార్సిల్ వ్యాన్ ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
నాల్‌పూర్ స్టేషన్ నుంచి బయల్దేరిన కాసేపటికే ప్రమాదం జరిగింది.
ట్రైన్ స్పీడ్ తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పినట్లు తెలిసింది. నిన్న ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు కోల్‌కతాకు బయల్దేరింది.