Page Loader
West Bengal: కశ్మీరీ ఉగ్రవాది జావేద్ మున్షీ అరెస్ట్.. సంచలన నిజాలు వెలుగులోకి!
కశ్మీరీ ఉగ్రవాది జావేద్ మున్షీ అరెస్ట్.. సంచలన నిజాలు వెలుగులోకి!

West Bengal: కశ్మీరీ ఉగ్రవాది జావేద్ మున్షీ అరెస్ట్.. సంచలన నిజాలు వెలుగులోకి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2024
05:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం, దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని కానింగ్‌లో ఒక అనుమానిత కాశ్మీరీ ఉగ్రవాదిని పోలీసులు పట్టుకున్నారు. ఈ అరెస్టు కాశ్మీర్, కోల్‌కతా పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో జరిగింది. ఆదివారం అనుమానిత ఉగ్రవాది జావేద్ మున్షీని అలీపూర్ కోర్టులో హాజరుపరిచారు. జమ్ముకశ్మీర్ పోలీసుల వివరాల ప్రకారం, అతన్ని డిసెంబర్ 31 వరకు ట్రాన్సిట్ రిమాండ్‌లో ఉంచాలని కోర్టు నిర్ణయించింది. జావేద్ మున్షీ, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఒక వ్యక్తి అని, పాకిస్థాన్ మద్దతుతో కార్యకలాపాలు నడిపే 'తెహ్రీక్-ఎ-ముజాహిదీన్' ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యుడని గుర్తించారు.

Details

పోలీసుల వాంటెడ్ లిస్టులో ఉగ్రవాది

ఈ నిందితుడు జమ్ముకశ్మీర్ పోలీసుల వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. పోలీసులు అతను ఉగ్రవాద కార్యకలాపాలను కాశ్మీర్ నుంచి నడిపిస్తున్నారని భావిస్తున్నారు. కశ్మీర్ పోలీసులకు రహస్య వర్గాల నుంచి జావేద్ బెంగాల్‌కు వస్తున్నట్లు సమాచారం అందింది. కశ్మీర్ నుండి శాటిలైట్ లొకేషన్ ద్వారా జావేద్‌ను ఛేజ్ చేసి, కోల్‌కతా పోలీసులకు సమాచారమిచ్చారు. ఫలితంగా జాయింట్ ఆపరేషన్ ద్వారా నిందితుడిని పట్టుకున్నారు. అయితే జావేద్ బెంగాల్‌కు ఏ విధమైన లక్ష్యంతో వచ్చాడన్నది ఇంకా అనుమానంగా ఉంది.