
CV Ananda Bose: బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్‌కు అస్వస్థత.. అత్యవసరంగా ఆస్పత్రికి తరలింపు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. సోమవారం ఉదయం ఆయన ఛాతీలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపారు.
దీంతో వెంటనే కోల్‌కతాలోని కమాండ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి ప్రాథమిక పరీక్షలు చేశారు.
గుండెలో బ్లాకేజ్ ఉన్నట్లు గుర్తించామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
గవర్నర్ చికిత్స పొందుతున్న కమాండ్ ఆస్పత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెళ్లి ఆయనను పరామర్శించారు.
Details
నిలకడగా గవర్నర్ ఆరోగ్య పరిస్థితి
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి ఆదేశించినట్లు వెల్లడించారు.
అదే సమయంలో కమాండ్ ఆస్పత్రి నుంచి గవర్నర్‌ను అపోలో ఆస్పత్రికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రాజ్‌భవన్ వర్గాలు స్పష్టం చేశాయి.