గవర్నర్: వార్తలు

వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అనూహ్య ప్రగతి: గవర్నర్ అబ్దుల్ నజీర్

వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అనూహ్య ప్రగతి సాధిస్తోందని, 11.43శాతం గ్రోత్ రేటును సాధించినట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. నవరత్నాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు-2023 ప్రారంభం నేపథ్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలకోపాన్యాసం చేశారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్-2023 సమావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో మొదలయ్యాయి. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం ఇదే.

'దిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర'; తెలంగాణ సీఎస్‌పై గవర్నర్ తమిళసై ఫైర్

పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించేలా రాష్ట్ర గవర్నర్‌ను ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతకుమారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీఎస్‌పై ఫైర్ అయ్యారు.

పెండింగ్ బిల్లులు‌ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ వద్ద పెండింగ్ బిల్లుల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దాఖలు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో గవర్నర్‌ను ప్రతివాదిగా చేర్చారు.

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం, సీఎం జగన్‌ హాజరు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు, మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్‌భవన్‌లో తేనేటి విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

11 Feb 2023

దిల్లీ

పవర్ డిస్కమ్ బోర్డుల నుంచి ఆప్ నామినీలను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్

దిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వైరం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ తన విచక్షణ అధికారాలను ఉపయోగించి ఆప్ నియమించిన ఇద్దరు ప్రభుత్వ నామినీలను ప్రైవేట్ విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌ల) బోర్డుల నుంచి గవర్నర్ తొలగించారు.

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: సంక్షేమంలో రాష్ట్రం భేష్: గవర్నర్ తమిళసై

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రాంరభమయ్యాయి. తొలిరోజు గవర్నర్ తమిళసై ప్రసంగంతో సభ మొదలైంది. ఎలాంటి సంచలనాలకు తావు లేకుండా గవర్నర్ ప్రసంగం ముగియడం గమనార్హం.

03 Feb 2023

తెలంగాణ

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ తమిళసై ప్రసంగం ఎలా ఉండబోతోంది?

రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య ఉప్పు- నిప్పు చందంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12.10గంటలకు 'బడ్జెట్ 2023-24' సమావేశాలు మొదలు కానుండగా, అందరి దృష్టి తెలంగాణ అసెంబ్లీపైనే ఉంది.

మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా కెప్టెన్ అమరీందర్ సింగ్ నియామకం!

బీజేపీ నాయకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియామకమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలుత సుమిత్రా మహాజన్‌ను తదుపరి గవర్నర్‌గా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సుమిత్రకు బదులుగా అమరీందర్ నియామకానికే కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

25 Jan 2023

తెలంగాణ

రాజ్‌భవన్‌లోనే గవర్నర్ రిపబ్లిక్ డే వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వం లేఖపై తమిళసై అసహనం

కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

20 Jan 2023

దిల్లీ

దిల్లీ: 'మీకు వడ్డించడం అంటే చాలా ఇష్టం', కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ కౌంటర్

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మధ్య మాటల యుద్ధం రోజుకు రోజుకు పెరుగుతోంది. ఇటీవల గవర్నర్‌పై కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్జీని కలిసేందుకు తనకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపణలు చేశారు. ఈ ప్రశ్నలపై సమాధానంగా శుక్రవారం లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా.. కేజ్రీవాల్‌కు లేఖ రాశారు.

అరుణా మిల్లర్: అమెరికాలో మేరీల్యాండ్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా ప్రమాణం

హైదరాబాద్‌లో జన్మించిన కాట్రగడ్డ అరుణా మిల్లర్ అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. నవంబర్‌లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ-అమెరికన్ రాజకీయ నాయకురాలిగా అరుణ చరిత్ర సృష్టించారు.

తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి

తమిళనాడు పేరును ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి 'తమిళగం' అని సంభోదించడంపై తీవ్ర దుమారం రేగింది. తమిళనాడు వ్యాప్తంగా గవర్నర్ ఆర్‌ఎన్ రవికి వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ఈ వివాదం రోజురోజుకు మరింత ముదురుతున్న నేపథ్యంలో గవర్నర్ రవి స్పందించారు.

ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు

దిల్లీలో అధికార పార్టీ అయిన 'ఆప్'కు డీఐపీ విభాగం షాకిచ్చింది. ప్రకటన కోసం వినియోగించిన రూ.163కోట్లు చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసులు జారీ చేసింది.

సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్!

తమిళనాడు ప్రభుత్వం.. గవర్నర్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. రోజుకో నాటకీయ పరిణామంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. గవర్నర్‌కు వ్యతిరకేంగా #GetOutRavi హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ ట్రెండ్ కావడం మరింత చర్చనీయాంశంగా మారింది.