రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు..మరో రూ.12 వేల కోట్లు రావాలని స్పష్టం
రూ.2000 నోట్లపై ఆర్ బి ఐ కీలక వ్యాఖ్యలు చేసింది. మరో రూ.12వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు భారతీయ రిజర్వ్ బ్యాంకుకు రావాల్సి ఉందని గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. మే 19న రూ.2 వేల నోట్ల ఉపసంహరణ ప్రకటించేనాటికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉన్నాయన్నారు. ఇందులో రూ.3.44 లక్షల కోట్లు ఇప్పటికే వెనక్కి వచ్చాయని ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం వివరించారు. వెనక్కి వచ్చిన వాటిలో 87 శాతం నోట్లు డిపాజిట్ల రూపంలోనే వచ్చాయన్నారు. రూ.2 వేల నోట్ల డిపాజిట్ కోసం అక్టోబర్ 7కి పొడిగించిన గడువు రేపటితో ముగియనుంది. గతంలో విధించిన సెప్టెంబర్ 30 తేదీకి తొలిసారిగా పొడిగింపు ఇచ్చింది ఆర్బీఐ.