Page Loader
'దిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర'; తెలంగాణ సీఎస్‌పై గవర్నర్ తమిళసై ఫైర్
తెలంగాణ సీఎస్‌పై గవర్నర్ తమిళసై ఫైర్

'దిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర'; తెలంగాణ సీఎస్‌పై గవర్నర్ తమిళసై ఫైర్

వ్రాసిన వారు Stalin
Mar 03, 2023
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించేలా రాష్ట్ర గవర్నర్‌ను ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతకుమారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీఎస్‌పై ఫైర్ అయ్యారు. దిల్లీ కంటే రాజ్‌భవన్ చాలా దగ్గరని, ఇక్కడికి వచ్చి బిల్లులను ఆమోదింపజేసుకోవాలని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ సీఎస్‌గా శాంతకుమారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం తనను ఒక్కసారి కూడా కలవకపోడవంపై గవర్నర్ మండిపడ్డారు.

తెలంగామ

సెప్టెంబర్ 14, 2022 నుంచి బిల్లులు పెండింగ్‌

గవర్నర్ తమిళిసై వద్ద సెప్టెంబర్ 14, 2022 నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన దాదాపు 10బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని ఈ మేరకు సీఎస్ పిటిషన్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య ప్రతిష్ఠంభణ నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు గవర్నర్ బహిరంగంగానే విమర్శించారు. బడ్జెట్ సమావేశాల తర్వాత గవర్నర్- ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన తొలగుతుందని అంతా భావించారు. కానీ పరిస్థితి మొదటికి రావడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బిల్లుల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.