Page Loader
కుటుంబంతో చర్చించిన తర్వాత వీఆర్ఎస్‌పై ఆలోచిస్తా: సోమేశ్‌కుమార్
ఏపీ క్యాడర్‌కు రిపోర్టు చేసేందుకు విజయవాడకు వెళ్లిన సోమేశ్‌కుమార్

కుటుంబంతో చర్చించిన తర్వాత వీఆర్ఎస్‌పై ఆలోచిస్తా: సోమేశ్‌కుమార్

వ్రాసిన వారు Stalin
Jan 12, 2023
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్.. రిపోర్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విజయవాడకు వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా.. నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సోమేశ్‌కుమార్ తన వీఆర్‌ఎస్‌పై కూడా స్పందించారు. వీఆర్ఎస్‌పై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే.. ఏదైనా విషయం చెబుతానని వెల్లడించారు.

సోమేశ్‌కుమార్

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే తాను ఏపీ క్యాడర్‌కు వచ్చా: సోమేశ్‌కుమార్

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే తాను ఏపీ కేడర్‌కు వచ్చినట్లు సోమేశ్‌కుమార్ వెల్లడించారు. ఒక అధికారిగా తాను డీఓపీటీ ఆదేశాలను పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి తాను రిపోర్ట్ చేస్తానని చెప్పారు. తెలంగాణ సీఎస్‌గా పని చేస్తున్న సోమేష్ కుమార్‌ క్యాడర్ కేటాయింపును ఇటీవల హైకోర్టు రద్దు చేసింది. సోమేష్‌కుమార్‌ ఏపీ క్యాడర్‌ కి వెళ్లాలని ఆదేశాలు‌ ఇచ్చింది. ఈ‌ సందర్భంగా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన గురువారం ఏపీ క్యాడర్‌లో రిపోర్టు చేసేందుకు విజయవాడకు వెళ్లారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ సీఎస్‌గా 1989 కేడర్‌కు చెందిన శాంతికుమారిని సీఎం కేసీఆర్ నియమించారు.