Page Loader
తెలంగాణలో 'ఫాక్స్‌కాన్' భారీ పెట్టుబడులు; లక్షమందికి ఉపాధి అవకాశాలు
తెలంగాణలో 'ఫాక్స్‌కాన్' భారీ పెట్టుబడులు; లక్షమందికి ఉపాధి అవకాశాలు

తెలంగాణలో 'ఫాక్స్‌కాన్' భారీ పెట్టుబడులు; లక్షమందికి ఉపాధి అవకాశాలు

వ్రాసిన వారు Stalin
Mar 02, 2023
06:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్‌తో సహా వివిధ బ్రాండ్‌లకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేసే ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యంగ్‌ లియు గురువారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో సమావేశమైన అనంతరం ఈ ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి, యంగ్ లియు సమక్షంలో కంపెనీ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వల్ల రాష్ట్రంలో లక్ష మందికి ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

హైదరాబాద్

హైదరాబాద్ శివార్లలో 250 ఎకరాల భూమి సిద్ధం!

భారతదేశంలోని అతిపెద్ద టి-వర్క్స్ ప్రారంభోత్సవానికి యంగ్ లియు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లను కలిగి ఉన్న తెలంగాణ, పెద్ద ఎత్తున ఉపాధిని సృష్టించగల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొంతకాలంగా ఎలక్ట్రానిక్ తయారీలో మార్క్యూ బ్రాండ్‌లను పొందడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఫాక్స్‌కాన్ కంపెనీ కోసం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ శివార్లలో 250 ఎకరాల ల్యాండ్‌ను సిద్ధంగా ఉంచినట్లు భారతీయ సాంకేతికత, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం ఏజెన్సీ ఇండియన్ టెక్ & ఇన్‌ఫ్రా వెల్లడించింది. ఫాక్స్‌కాన్ ఈ మధ్యకాలంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. శ్రీపెరంబుదూర్‌లోని ఐఫోన్ ఫ్యాక్టరీలో వర్క్‌ఫోర్స్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ యూనిట్లలో దాదాపు 15,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు.