
ఐటీ నిపుణుల నియామకంలో హైదరాబాద్ నంబర్ వన్
ఈ వార్తాకథనం ఏంటి
సాఫ్ట్‌వేర్ నిపుణులను నియమించుకోవడంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 20 నగరాల జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు టెక్నికల్ హైరింగ్ ఏజెన్సీ అయిన 'కారత్' జాబితాను విడుదల చేసింది.
ర్యాంకింగ్స్‌లో జాబితాలో చెన్నై 12, గురుగ్రామ్ 13, బెంగళూరు 15, పూణె 17, ముంబయి 20వ స్థానంలో నిలిచాయి.
నగరంలో పలు దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టడంతో పాటు టీ-హబ్ వంటి సౌకర్యాలలో మరిన్ని స్టార్టప్‌లను అభివృద్ధి చేయడంతో హైదరాబాద్ ఐటీ రంగంలో అపారమైన వృద్ధిని సాధించినట్లు ఆ ఏజెన్సీ పేర్కొంది.
ఈ జాబితాలో హైదరాబాద్ కంటే ముందు సింగపూర్, న్యూయార్క్, లండన్ వంటి నగరాలు ఉన్నాయి.
హైదరాబాద్
అమెరికా నగరాలతో పోటీ పడుతున్న భారతీయ సిటీలు
అమెరికా ప్రధాన నగరాలతో పోటీ పడుతూ భారత్‌లోని సిటీలు సాఫ్ట్‌వేర్ డెవలపర్లను నియమించుకుంటున్నట్లు 'కారత్' నివేదిక వెల్లడించింది.
ఆగ్నేయాసియా అంతటా బలమైన ఇంజినీరింగ్ మార్కెట్ల ట్రెండ్‌ను కొనసాగిస్తూ భారతదేశంలోని ఆరు నగరాలు ఈ సంవత్సరం టాప్20 స్థానాల్లో నిలిచాయి.
డిజిటలైజేషన్ ట్రెండ్‌కు తగ్గట్టుగా గ్లోబల్ కంపెనీలు నిరంతర పెట్టుబడులు పెడుతున్నాయి. దేశంలోని ఐటీ నిపుణుల నియామకాలు నిత్య జరుగుతున్నాయి.
నగరం, రాష్ట్రంలో ఐటీ రంగం వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.