Page Loader
రంగారెడ్డి: మర్మాంగాన్ని కోసి, గుండెను బయటికి తీసి స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన యువకుడు
స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన యువకుడు

రంగారెడ్డి: మర్మాంగాన్ని కోసి, గుండెను బయటికి తీసి స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన యువకుడు

వ్రాసిన వారు Stalin
Feb 25, 2023
02:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓ యువకుడు తన స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు. మర్మాంగాన్ని కోసి, గుండెను బయటికి తీసి అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. తను ప్రేమించిన యువతిని తన స్నేహితుడు ఇష్టపడటమే ఈ హత్యకు కారణం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. హరి అనే యువకుడు అబ్దుల్లాపూర్‌మెట్‌లో నివాసం ఉంటాడు. అతని స్నేహితుడు నవీన్ (20) ఎంజీ యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్(ఈఈఈ) చదువుతున్నాడు. వీరిద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. దీంతో తన ప్రేమకు అడ్డొస్తున్నాడని నవీన్‌ను హరి చంపాలని నిర్ణయించుకున్నాడు. నవీన్‌‌ను హత్య చేసేందుకు హరి పథకం రచించాడు. నవీన్‌ను పార్టీకి రమ్మని ఆహ్వానించాడు. ఫిబ్రవరి 17న ఇద్దరు పార్టీ చేసుకునేదుకు కలుసుకున్నారు.

రంగారెడ్డి

నవీన్ తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన విషయం

మద్యం సేవించే సమయంలో ప్రేమించిన అమ్మాయి ప్రస్తావన హరి తీసుకురావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఈ పార్టీ జరిగిన నాలుగు రోజు తర్వాత తన కుమారుడు నవీన్ కనిపించడం లేదని శంకరయ్య నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిబ్రవరి 22న తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో కనిపించడంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హరి తల్లిదండ్రులను కూడా విచారించారు. తప్పించుకునే మార్గం లేదని తెలుసుకున్న హరి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. జరిగిన విషయం అంతా పోలీసులకు చెప్పాడు. మర్మాంగాన్ని కోసి, గుండెను బయటికి తీసిన నవీన్ మృతదేహాన్ని చూసిన పోలీసులు విస్తుపోయారు.