Impact of Modern Wars: గల్ఫ్ నుంచి గాజా వరకు… యుద్ధాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎంత ప్రభావం?
ఈ వార్తాకథనం ఏంటి
ఏ కారణంతో జరిగినా యుద్ధాలు మిగిల్చే విషాదం మాటల్లో చెప్పలేనిది. రణరంగంలో పోరాడే సైనికులే కాకుండా అమాయక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. యుద్ధాల వల్ల విలువైన ఆస్తులు నాశనం కావడంతో పాటు సహజ వనరులు కూడా భారీగా దెబ్బతింటున్నాయి. ఇటీవలి కాలంలో ఆధునిక సాంకేతికతలు పెరిగిన నేపథ్యంలో యుద్ధాల రూపం మారిపోయింది. అయినప్పటికీ యుద్ధాల్లో పాల్గొన్న దేశాలు మాత్రమే కాకుండా బాధిత దేశాల ఆర్థిక వ్యవస్థలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. మనిషి ప్రాణాల విలువను డబ్బుతో కొలవడం సాధ్యం కాదు.అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా జరిగిన యుద్ధాల కోసం దేశాలు ఖర్చు చేసిన నిధులు,వాటి వల్ల కలిగిన ఆర్థిక నష్టాలను అంచనా వేసే ప్రయత్నాలు నిపుణులు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
వివరాలు
గల్ఫ్ యుద్ధం (1990-91)
అరబ్ మానిటరీ ఫండ్ అంచనాల ప్రకారం గల్ఫ్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా ప్రాంతానికి సుమారు రూ.62.19 లక్షల కోట్లు(67,600 కోట్ల డాలర్లు)మేర ఆర్థిక నష్టం వాటిల్లింది.
9/11 తర్వాత అమెరికా యుద్ధాలు
2001లో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన 9/11దాడుల తర్వాత అమెరికా దాదాపు రెండు దశాబ్దాల పాటు వివిధ దేశాల్లో యుద్ధాలు నిర్వహించింది.
బ్రౌన్ యూనివర్శిటీ నివేదిక ప్రకారం ఈ యుద్ధాల కోసం అమెరికా మొత్తం రూ.735.97లక్షల కోట్లు(8 లక్షల కోట్ల డాలర్లు)ఖర్చు చేసింది.ఈ యుద్ధాల్లో సుమారు 9లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా.
అఫ్గానిస్థాన్‌పై యుద్ధం (2001-2019):రూ.183.99 లక్షల కోట్లు (2 లక్షల కోట్ల డాలర్లు)
ఇరాక్,సిరియా యుద్ధాలు (2003-2023):రూ.265.86 లక్షల కోట్లు (2.89 లక్షల కోట్ల డాలర్లు)
వివరాలు
ఆపరేషన్ పరాక్రమ్ (2001-02)
భారత పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడి అనంతరం భారతదేశం సరిహద్దుల్లో భారీ స్థాయిలో సైనిక మోహరింపులు చేపట్టింది.
ఈ చర్యల కోసం భారత్ సుమారు రూ.5,519 కోట్లు (60 కోట్ల డాలర్లు) ఖర్చు చేసింది.
దీనికి ప్రతిస్పందనగా పాకిస్థాన్ కూడా తన సేనలను మోహరించేందుకు రూ.3,680 కోట్లు (40 కోట్ల డాలర్లు) ఖర్చు చేసినట్లు సమాచారం.
వివరాలు
సిరియా అంతర్యుద్ధం (2011-2024)
సుమారు పదమూడు సంవత్సరాల పాటు కొనసాగిన సిరియా అంతర్యుద్ధం దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.
ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ఈ యుద్ధం వల్ల రూ.73.60 లక్షల కోట్లు (80,000 కోట్ల డాలర్లు) మేర ఆర్థిక నష్టం జరిగింది.
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం సిరియాను తిరిగి పునర్నిర్మించేందుకు మరో రూ.19.87 లక్షల కోట్లు (21,600 కోట్ల డాలర్లు) ఖర్చు కావాల్సి ఉంటుంది.
వివరాలు
ఉక్రెయిన్‌పై రష్యా దాడి (2022 నుంచి)
ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడింది.
సెంటర్ ఫర్ ఎకనామిక్ పాలసీ రీసెర్చ్ అంచనాల ప్రకారం ఈ యుద్ధం వల్ల ప్రపంచానికి రూ.220.79 లక్షల కోట్లు (2.4 లక్షల కోట్ల డాలర్లు) మేర భారంగా మారింది.
2025లో ప్రతిరోజూ యుద్ధానికి సగటున రూ.1,582 కోట్లు (17.2 కోట్ల డాలర్లు) ఖర్చవుతున్నట్లు ఉక్రెయిన్ సైన్యాధిపతి వెల్లడించారు.
ఉక్రెయిన్‌ను పూర్తిగా పునర్నిర్మించేందుకు వచ్చే దశాబ్దంలో రూ.54.09 లక్షల కోట్లు (58,800 కోట్ల డాలర్లు) అవసరమవుతాయని అంచనా.
వివరాలు
ఆపరేషన్ సిందూర్ (2025)
భారత్-పాకిస్థాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఆపరేషన్ సిందూర్ వల్ల భారత్‌పై సుమారు రూ.3,753 కోట్లు (40.78 కోట్ల డాలర్లు) మేర ఆర్థిక భారం పడిందని రీసెర్చ్ ఫౌండేషన్ తెలిపింది.
పాకిస్థాన్‌పై ఈ భారం సుమారు రూ.13,805 కోట్లు (150 కోట్ల డాలర్లు) వరకు ఉండొచ్చని అంచనా.
వివరాలు
గాజాపై ఇజ్రాయెల్ దాడి (2023)
హమాస్ ఉగ్రవాదులను నిర్మూలించాలనే లక్ష్యంతో గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల ఆ దేశానికి భారీ ఆర్థిక వ్యయం ఏర్పడింది.
బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ సమాచారం ప్రకారం మొత్తం రూ.10.30 లక్షల కోట్లు (11,200 కోట్ల డాలర్లు) ఖర్చు అయ్యింది. ఈ వ్యయంలో:
రక్షణ రంగ ఖర్చులు - రూ.7.08 లక్షల కోట్లు (7,700 కోట్ల డాలర్లు)
ఆస్తి పన్ను పరిహార నిధి - రూ.96,595 కోట్లు (1,050 కోట్ల డాలర్లు)
పౌరుల భద్రత, సదుపాయాలు - రూ.1.65 లక్షల కోట్లు (1,800 కోట్ల డాలర్లు)
వడ్డీ చెల్లింపులు - రూ.55,197 కోట్లు (600 కోట్ల డాలర్లు)
అదనంగా, ఇజ్రాయెల్‌కు అమెరికా అందించిన సైనిక సహాయం విలువ రూ.1,99,722 కోట్లు(2,170 కోట్ల డాలర్లు).
వివరాలు
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం (2025)
గాజా పునర్నిర్మాణానికి రూ.6,44,263 కోట్లు (7,000 కోట్ల డాలర్లు) అవసరమవుతాయని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది.
పన్నెండు రోజుల పాటు కొనసాగిన ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ సుమారు రూ.59,824 కోట్లు (650 కోట్ల డాలర్లు) ఖర్చు చేసినట్లు అంచనా.
ఇరాన్‌కు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా కలిపి సుమారు రూ.3,22,132 కోట్లు (3,500 కోట్ల డాలర్లు) మేర నష్టం వాటిల్లి ఉండవచ్చని రక్షణ విశ్లేషకులు భావిస్తున్నారు.