అసెస్‌మెంట్ పరీక్షలో ఫెయిలైన 600 ఫ్రెషర్స్ ను తొలగించిన ఇన్ఫోసిస్ సంస్థ
ఇంటర్నల్ ఫ్రెషర్స్ అసెస్‌మెంట్ (FA) పరీక్షలో ఫెయిలైన కారణంగా ఇన్ఫోసిస్ 600 మంది ఫ్రెషర్లను తొలగించింది. గత నెలలో, దేశంలోని మరో ప్రముఖ ఐటీ సంస్థ విప్రో కూడా ఇలానే 450 మంది ఫ్రెషర్లను తొలగించింది. మహమ్మారి సమయంలో భారతీయ ఐటీ కంపెనీలు పెద్దమొత్తంలో ఉద్యోగులను నియమించుకున్నాయి. అయితే, ఇప్పుడు ఆర్థిక మాంద్యం కారణంగా తీసుకున్నవారికి ఆలస్యంగా ఆఫర్ లెటర్‌లు పంపడం లేదా రద్దు చేయడం చేస్తున్నాయి. చాలా మంది ఫ్రెషర్లు తమ ఉద్యోగాల పరిస్థితి తెలియక ఆందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి తొలగింపులు మరింత భయపెడుతున్నాయి. ఇన్ఫోసిస్ తొలగించిన ఫ్రెషర్‌లలో ఎక్కువ మంది జూలై 2022 తర్వాత సెలెక్ట్ అయినవారే.
ఈ 600 మందిలో 208 మందిని రెండు వారాల క్రితం తొలగించారు
SAP ABAP టీమ్‌లోని 150 మంది ఫ్రెషర్‌లలో కేవలం 60 మంది మాత్రమే పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు, మిగిలిన వారందరిని తొలగించారు. జూలై 2022 కంటే ముందు కంపెనీలో చేరిన వారు FA పరీక్షలో ఫెయిలైనా సరే వారిని తొలగించలేదు. మరోవైపు, FA పరీక్షలో ఫెయిలైన వారిని ఎప్పుడూ తొలగిస్తామని ఆ సంస్థ తెలిపింది. ఈ 600 మందిలో 208 మందిని రెండు వారాల క్రితం తొలగించారు. ఇన్ఫోసిస్ Q3 FY23లో 6,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. ఇన్ఫోసిస్ నుండి సమాచారం కోసం వందలాది మంది ఫ్రెషర్లు ఎదురుచూస్తున్నారు. జనవరిలో, మరో భారతీయ కంపెనీ విప్రో కూడా ఇలాగే అస్సెస్మెంట్ టెస్ట్ లో ఫెయిలైన 452 మంది ఫ్రెషర్స్ ను తొలగించింది.