మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన ఇన్ఫోసిస్ లాభం రూ. 6,586కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఇన్ఫోసిస్ ప్రకటించింది. కంపెనీ నికర లాభం 12.68% పెరిగి డిసెంబర్ 31, 2022తో ముగిసిన త్రైమాసికంలో రూ.6,586 కోట్లు వచ్చాయి. కంపెనీ ఆదాయం మూడో త్రైమాసికంలో రూ.39,087 కోట్లు. ఇన్ఫోసిస్ మొత్తం ఆదాయం రూ. 39,087 కోట్లు, ఇందులో రూ. 38,318 కోట్ల నికర అమ్మకాలు, రూ. 769 కోట్లు ఇతర ఆదాయాల ద్వారా వచ్చాయి. ఈ ఏకీకృత ఆదాయం రూ.1,965 కోట్లు గత త్రైమాసికం కంటే ఎక్కువ. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రూ. 6,708 కోట్లు ఎక్కువ. మూడో త్రైమాసిక వ్యయం రూ. 30,156 కోట్లు, ఇందులో ఉద్యోగుల ప్రయోజనాల కోసం రూ. 20,272 కోట్లు ఖర్చు చేసారు.
ఈ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ ఈపీఎస్ రూ. 13.86 నుండి రూ. 15.72 కు పెరిగింది
వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయాలు (EBITDA) కంపెనీ ఆర్థిక పనితీరు, కంపెనీల మధ్య లాభదాయకతను పోల్చడానికి ఉపయోగించబడుతుంది. గత డిసెంబర్‌తో పోలిస్తే ఇది 13.3% పెరిగింది. కంపెనీ లాభదాయకతను కొలిచే మరొక మెట్రిక్ షేరుకు ఆదాయాలు (EPS), ఈ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ ఈపీఎస్ రూ. 13.86 నుండి రూ. 15.72 కు పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మొత్తం ఆదాయం రూ. 49,275 కోట్లు పన్ను తర్వాత లాభం (PAT) రూ.10,659 కోట్లు, ఇన్ఫోసిస్ మొత్తం ఆదాయం రూ. 32,389 కోట్లు PAT రూ. 6,210 కోట్లు. విప్రో మొత్తం ఆదాయం రూ. 16,941.8 కోట్లు PAT రూ. 2,282.9 కోట్లు.